United Nations Day అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవం
United Nations Day
మరో ప్రపంచ యుద్దాన్ని ఐరాస ఆప గలదా?
అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవం
చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థ. 1930 నాటి మహామాంద్యం వల్ల ఐరోపాలో నియంతలు అధికార పీఠాలు అధిరోహించారు. ఆపై సంభవించిన రెండో ప్రపంచ యుద్ధం, మానవాళి చరిత్రనే రక్తాక్షరాలతో లిఖించింది. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారానికి ఒక బహుముఖీన United Nations Day అంతర్జాతీయ సంస్థ అవసరమని ప్రపంచ నాయకులు భావించారు.
1945లో ఐ.రా.స. ఏర్పడినప్పుడు 51మంది సభ్య దేశాలున్నాయి. ఇప్పుడు 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వ ప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతా మండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళ కోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందుతాయి.
అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా పాటిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగు తున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్‌వెల్ట్ , బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని అట్లాంటిక్ ఛార్టర్ అంటారు.
ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధ భయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినవి. అంతర్జాతీయ తగాదాలను శాంతి యుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం, సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం తదితరాలు సమితి ఆశయాలు.
శాంతి కోసం ఐక్యరాజ్య సమితి కృషి
ఐక్యరాజ్య సమితి స్థాపించిన నాటి నుండి నేటి వరకు 76 సంవత్సరాల కాలంలో ప్రపంచ శాంతికి దోహదం చేసే ఎన్నో కార్యకలాపాలను నిర్వహించింది. ఐతే ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాదాన్ని నివారించడంలో సమితి విఫలం అయ్యింది. ఐక్యరాజ్య సమితిలోని అగ్ర రాజ్యాల ఆధిపత్యం కొనసాగు తుండటం చిన్న దేశాలకు శాపంగా మారుతున్నది. అగ్ర రాజ్యాల చేతిలో ఉన్న ఐరాస తన లక్ష్యాలను నెరవేర్చలేక పోతున్నది. కాలం గడుస్తున్న కొద్దీ ఐరాస బలహీన పడుతున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 76 ఏళ్ళ పాటు ప్రపంచ శాంతికి అవిరళమైన కృషి చేసిన ఐరాస మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూసి, మానవాళిని కాపాడ గలదని మనసారా ఆశిద్దాం. United Nations Day
రామకిష్టయ్య సంగన భట్ల
9440595494