Life Partner Selection లైఫ్ పాట్నర్ సెలక్షన్ స్వంత నిర్ణయం
Life Partner Selection లైఫ్ పాట్నర్ సెలక్షన్ స్వంత నిర్ణయం
తల్లిదండ్రుల మాటలు పెడచెవిన బెట్టి తమకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని యువతకు మీరూ బోధించడం ఎంత వరకు సమంజసం..? కొన్ని సందర్భాల్లో సమంజసమే. నిజం చెప్పాలంటే యువతీ యువకులు తమ లైఫ్ పార్టనర్ ను స్వయంగా ఎంపిక చేసికోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు సహకరించాలి. లేదా పిల్లలే తమ సెలక్షన్ సరియైనదే అని వారు తమ తల్లిదండ్రులను కన్విన్స్ చేయాలి. ఆ తర్వాతనే పెళ్ళికి సిద్ధపడాలి.
ఐతే ఒక్కోసారి తల్లిదండ్రుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు.. ! ఇక్కడ తల్లిదండ్రుల అభ్యంతరం కేవలం ఆస్తులపైనెమో ఆలోచన చేయాలి. వరకట్నం, ఆస్తిపాస్తులు, కులం, మతం గురించి ఆలోచనైతే వారు అభ్యుదయ కరంగా ఆలోచించడం లేదని అర్థం. అటువంటి సందర్భాలలో (తల్లిదండ్రులు మొండిగా వ్యవహరించిన పరిస్థితుల్లో) కూడా యువత వెనుకంజ వేయద్దు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా పిల్లలు నిరభ్యంతరంగా నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవచ్చు. మంచి తల్లిదండ్రులు ఎపుడూ మంచి నిర్ణయాలే తీసుకుంటారు. మానసిక పరిపక్వత చెందిన పిల్లల ఆలోచనలను వారి తల్లిదండ్రులు గౌరవిస్తారు. గౌరవించాలి.. !
Rajeshwer Chelimela, Jvv Telangana