కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాఘజనగర్ పట్టణంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న TRT ఉచిత కోచింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ గారితో చర్చించిన ఎమ్మెల్యే కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారితో సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారు సమావేశమయ్యారు.. నియోజకవర్గంలో టీచర్ ఉద్యోగం కోసం సిద్దమయ్యే అర్హులైన అభ్యర్థులకు కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత TRT కోచింగ్ ఇచ్చే ఏర్పాట్లపై కలెక్టర్ గారితో ఎమ్మెల్యే చర్చించారు..అనంతరం క్యాంపు కార్యాలయంలో నాటిన మొక్కలను కలెక్టర్ గారు పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్..