Header Top logo

Toxic propaganda against Gandhi..? మహాత్మగాంధీపై విషప్రచారం

Toxiమహాత్మ గాంధీc propaganda against Gandhi..? మహాత్మగాంధీపై విషప్రచారం

ఎందుకో తెలియదు కానీ నా చిన్నప్పటి నుండీ గాంధీని మహాత్ముడు అంటూనే parallel గా ఆయన గురించి విషప్రచారం జరిగేది. నేను కూడా ఆ విషప్రచారం ని నమ్మాను నా బీటెక్ వరకు. కానీ గ్రూప్స్ కొరకు ప్రామాణిక చరిత్ర ని చదవడం మొదలు పెట్టినప్పటి నుండే అర్థం అయింది ఆయన నిజమైన గొప్పతనం ఏంటో!! ఇలాంటి మనిషి, భూమి పై తిరిగాడు అంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చు అని ఐన్ స్టీన్ లాంటి మహానుభావులు అన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. గాంధీపై జరుగుతున్న, జరిగిన విషప్రచారాలు వాటి పై నా అభిప్రాయాలు!!

  1. గాంధీ ఈ దేశాన్ని సర్వనాశనం చేశాడు!!

అసలు సర్వనాశనం చేయడానికి అప్పుడు దేశం ఎక్కడ ఏడ్చి సచ్చింది. 500లకు పైగా రాజ్యాలతో దేశం ముక్కలు అయి ఐక్యమత్యం లేకుండా కొట్టుకు చచ్చేవారు. దీన్ని వాడుకునే కదా తెల్లోడు 300 యేండ్లు పరిపాలించాడు. జాతీయతని సామాన్య ప్రజల్లోకి తీసుకుపోయి, దేశం అనే భావనను సామాన్య ప్రజల వరకు తీసుకు పోయింది గాంధీ మాత్రమే.

  1. గాంధీ పటేల్ ని కాకుండా నెహ్రూ ని ప్రధాన మంత్రి ని చేశాడు!!

స్వాతంత్ర్య సమయానికే పటేల్ గారు వృధాప్య అనారోగ్యం తో బాధపడుతున్నారు(1950 లో మరణించారు అప్పటికి ఆయన వయస్సు75) పటేల్ కూడా ప్రధానమంత్రి పదవి పై అంతగా పట్టుబట్టలేదు!! అందుకే గాంధీ, వెస్ట్రన్ దేశాలకు ధీటుగా నిలబడాలి అన్న ఉద్దేశ్యం తో యువకుడు, అభ్యుదయ ఆధునిక భావాలు, ఎంతో ముందు చూపు కలిగిన నెహ్రూ నే ఎంచుకున్నాడు. ఇక్కడ గాంధీ, నెహ్రూ పటేల్ లని ఉద్దేశిస్తూ జోడెద్దుల బండి తో పోల్చడం మరచిపోకూడదు. వారిద్దరికీ సమాన ప్రాధాన్యత ని ఇచ్చాడు అనేది నిజం.

  1. గాంధీ సుభాషచంద్రబాస్ ని తొక్కేసాడు!!

అసలు గాంధీకి జాతిపిత అనే టైటిల్ ని ఇచ్చిందే సుభాష్ చంద్రబోస్ బోస్ అని ఎంత మందికి తెలుసు!! బోస్ కూడా గాంధీ అనుచరుడే. కానీ సైద్ధాంతిక అభిప్రాయ భేదాల వల్ల బోస్ హింస మార్గాన్ని ఎంచుకున్నారు. దాని కోసం చివరికి బోస్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరుడు, నరరూప రాక్షసుడు అయిన హిట్లర్ ని సహాయం చేయమని అడిగాడు. ఇది ఎంత వరకు నైతికమో, సమంజసమొ మీ ఊహ కె వదిలేస్తున్న. ఉద్దేశ్యం మంచిది అయితే సరిపోదు దాన్ని చేరే దారి కూడా మంచిది అయి ఉండాలి!! యుద్ధం, హింస ఎన్నటికీ శాశ్వత పరిష్కారం ఇవ్వదు.

4.గాంధీ ఒక్కడి వల్లే స్వాతంత్య్రం రాలేదు తిలక్ పటేల్ భగతసింగ్ బోస్ లు కూడా గాంధీ కంటే ఎక్కువ గా కృషి చేశారు. కానీ గాంధీకే ఎక్కువ పేరు వచ్చింది??

కాదని ఎవరు అన్నారు కానీ వీళ్లంతా ఏదో సమయంలో గాంధి మార్గం లో ప్రయాణించిన వారే. ఉద్యమాలు చేసిన వారికన్నా ఉద్యమ శిల్పుల కి ఉద్యమం కి నాయకత్వం వహించిన వారికే ఎక్కువ పేరు వస్తుంది ఇందులో తప్పేముంది!!?

5.గాంధీ వల్లే దేశ విభజన జరిగింది!!

స్వాతంత్య్రం తెచ్చినోడే, ఈ రోజు నా శరీరం రెండుగా చీల్చబడింది నేనెట్లా సంబరాలు జరుపుకొను అంటూ స్వాతంత్ర్య సంబరాలు బహిష్కరించాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు గాంధీ ఎంత బాధపడ్డారో దేశవిభజన వల్ల. చివరికి దేశ విభజన కాకూడదు అని నెహ్రు ని కాదని జిన్నా ని ప్రధానమంత్రి ని చేయడానికి కూడా ఒప్పుకున్నాడు చివరికి. కానీ మతోన్మాద జిన్నా వినలేదు. గాంధీ దేశ విభజన ను ఆపడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు!!

  1. గాంధీ దేశవిభజన సమయంలో ముస్లిం లకి సపోర్ట్ చేసి హిందువుల ఊచకోత కి కారణం అయ్యాడు

గాంధీ సపోర్ట్ చేసింది అహింస వాదానికి. హింస ఎవరిమిద జరిగినా కూడా వద్దన్నాడు. అది హిందువుల పైన అయినా సరే ముస్లిం ల పైనా అయినా సరే. అయినా ఊచకోత జరిగింది అతివాద హిందు ముస్లిం గ్రూపుల వల్ల. మధ్యలో గాంధీ ఏం చేశాడు? వాళ్ళని అడ్డుకోవడానికి కలకత్తా లో నిరాహార దీక్ష కు పునుకొని హింసను ఆపగలిగాడు. అక్కడ పాకిస్థాన్ లో జరుగుతున్న హిందువుల ఊచకోత ఆపడానికి కూడా పాకిస్థాన్ కి వెళ్లి పాకిస్థాన్ తో చర్చ లు జరపాలి అనుకున్న సమయంలో ఓ హిందూ మతోన్మాదుడి చేతిలో చనిపోయారు.

  1. గాంధీ దళితులను మోసం చేశాడు

ఇక్కడ గమనించాల్సింది గాంధీ ఓ ఉదారవాద హిందు వాదీ. ప్రత్యేక ఎలెక్టోరల్ ఇస్తే హిందు సమాజం చిలిపోతుంది అని తాను ఎప్పుడూ చేయని విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి మరీ అంబెడ్కర్ తో పునా ఒడంబిక ని ఒప్పించాడు. ఈ విషయంలో లో అంబేద్కరిస్టుల ఆక్రోశం లో తప్పు లేదు కానీ గాంధీ అస్పృశ్యత నివారణ కోసం, దళితుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషిచేశారు దళితులను హరిజనులు అంటూ వాళ్ళకి హిందు సమాజంలో సమాన హోదా కల్పించడానికి ప్రయత్నించాడు.

8.గాంధీ భగత్ సింగ్ ఉరిశిక్ష ని ఆపడానికి ప్రయత్నం చేయలేదు.

ఇది చాలా సత్య దూరం. ఈ వాదన భగత్ సింగ్ పై ఉన్న ప్రేమ తో కాదు, గాంధీ పై ఉన్న ద్వేషం తో చేస్తారు. ద్వేషం ఎందుకంటే మత కలహాలు జరకుండా అపుతున్నాడు అనే కోపం లో వచ్చింది. ఇక విషయం కి వస్తే గాంధీ అహింస వాదీ. హింస ఏ రూపం లో ఉన్న ఆయనకు నచ్చదు. దానికోసం ఎంతైనా తెగిస్తారు. సహాయ నిరాకరణ ఉద్యమం బాగా పీక్ స్టేజి లో ఉన్నప్పుడు ఒక చిన్న హింస (చౌరీ చౌరా సంఘటన) చెలరేగడం వల్ల అంత పెద్ద ఉద్యమం నే మధ్యలో ఆపేశాడు. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి హింస మార్గం ని ఎంచుకున్న భగత్ సింగ్ ని శిక్ష కి అర్హుడి గానే చూశాడు. ఇక్కడ శిక్ష అంటే ఉరి శిక్ష కాదు, జైలు శిక్ష అందుకే ఆయన అప్పటి వైస్ రాయ్ కి ఉరిశిక్ష ని రద్దు చేసి జైలు శిక్ష గా చేంజ్ చేయాలి తన శాయశక్తులా ప్రయత్నించారు. 1931 కాంగ్రెస్ సభ లో ఉరిశిక్ష కి వ్యతిరేకంగా నెహ్రూ తో ఒక తీర్మానం కూడా చేయించారు ఇర్విన్ కి గాంధీ రాసిన అభ్యర్థన లేఖ గూగుల్ లో చూడవచ్చు. కానీ ఇర్విన్ వీటన్నింటికి లొంగలేదు.

గాంధీ లో కూడా నాకు కొన్ని వ్యక్తిగత విషయాలు నచ్చవు. After all గాంధీ కూడా ఒక మనిషే కదా లోపాలు ఉండటం సహజం. లోపాలని వదిలిపెట్టి ఆయన వదిలిపెట్టి వెళ్లిన మంచిని స్వీకరించాలి.

ఇక ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా న్యూక్లియర్ ఆయుధాల కన్నా శక్తివంతమైన సత్యం అహింస ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేసి ప్రంపంచ చరిత్ర లో ఉద్యమాల పంథా ని మార్చి ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా తెల్లోడి ని తరిమికొట్టిన ధీశాలి దార్శనికుడు మన గాంధీ.

ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న 90% ఉద్యమాలు గాంధేయ మార్గంలో జరుగుతున్నవే. ఈ గాంధేయ మార్గం వల్లే మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి మహానుభావులు కూడా రక్తం చిందించకుండా ప్రాణ నష్టం జరగకుండా తమ ఉద్యమాలని నడిపి సఫలీకృతం అయ్యారు. ఇంతటి శక్తివంతమైన “సత్యం, అహింస” లను ప్రపంచానికి పరిచయం చేసిన గాంధీ గారికి, వారి జయంతి సందర్భంగా ఇవే నా నివాళులు!!!

 

సేకరణ.. చెలిమెల రాజేశ్వర్

Leave A Reply

Your email address will not be published.

Breaking