Header Top logo

నేటి వ్యభిచార మీడియా.. కుహనా మేధావులు

నేటి వ్యభిచార మీడియా.. కుహనా మేధావులు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ ఇదే..

వ్యభిచార మీడియా.. ఈ పదం వాడితే ఆ వ్యభిచారం చేసే వాళ్లను నిజంగా అవమానించినట్లే. పవిత్రమైన జర్నలిజం పక్క దారి పట్టి చాలా ఏళ్లు గడిసింది. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో జర్నలిజం ముసుగులో ఉన్న కొందరు మేధావులు ఎవరికి వారే నిజాయితీ పరులుగా పోజులు గొడుతూ పాలకులకు సహాకరిస్తూ పబ్బం గడుపుకునే వారు ఎందరో. 

ఈ ఉపొద్ఘాతం ఎందుకు చెబుతున్నానంటే..

ఈ కథ చదివితే మీకే అర్థం అవుతుంది.

——

ఒకసారి ఉగ్రవాదులు ఒక ప్రొఫెసర్ ని, ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ ని, ఒక ఆర్మీ కర్నల్ ని అపహరించారు.

ముగ్గురిని చంపి వేయాలని నిర్ణయం జరిగింది. అయితె చంపేసే ముందు వారి ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పుకునే అవకాశం ఇచ్చారు ఉగ్రవాదులు.

ప్రొఫెసర్: “నేను మీ సమర్ధకుడిని. కశ్మీర్ స్వాతంత్య్ర ఆకాంక్షకు బలమైన మద్దతు దారుడిని. నన్ను చంపకుండా వదిలేస్తే మరింత బలంగా ఆ దేశ నడిబొడ్డులో మీ వాదనని సమర్ధిస్తూ మీ పని సులువయ్యేందుకు ప్రయత్నిస్తాను” అన్నాడు.

రిపోర్టర్: “నన్ను కూడా చంపద్దు. నేను ప్రతి రోజూ భారత ప్రభుత్వాన్ని నా ఛానల్ లో విమర్శిస్తూ ఉంటాను. నేను బ్రతికి ఉండటం వలన మీకు ఎంతో లాభం” అన్నాడు.

ఆర్మీ కర్నల్: “నన్ను చంపే ముందు నన్ను బాగా కొట్టండి. ఇదే నా చివరి కోరిక” అన్నాడు.

ఉగ్రవాద నాయకుడు: “నువ్వు కూడా నిన్ను చంప కుండా వదిలేయమని ప్రాధేయపడు. అప్పుడు మా నిర్ణయం చెబుతాము” అన్నాడు.

ఆర్మీ కర్నల్: “లేదు. నన్ను చంపే ముందు నన్ను బాగా కొట్టండి. ఇదే నా చివరి కోరిక” అన్నాడు.

తమ నాయకుడు సంజ్ఞ అనుసరించి, ఒక ఉగ్రవాది తన దగ్గర ఉన్న AK-47 మడిమతో ఆర్మీ కర్నల్ ని కొట్టసాగాడు. వెంటనే ఆర్మీ కర్నల్ అతడి దగ్గర ఉన్న AK-47 లాక్కుని ఆ ఉగ్రవాదితో సహా మిగిలిన ఉగ్రవాదులు అందరినీ చంపేశాడు.

అది ప్రత్యక్షంగా చూసిన ప్రొఫెసర్, టీవీ ఛానల్ రిపోర్టర్ ఆశ్చర్యపోతూ అడిగారు – “నీ వద్ద ఇంత ధైర్యం, నేర్పు ఉండి కూడా, మొదట్లోనే అందరిని చంపకుండా నిన్ను నువ్వు కొట్టించుకున్నావు ఎందుకని” ?

ఆర్మీ కర్నల్: “నేను దాడి చేసే ముందు వాళ్ళు దాడిని మొదలెట్టాలి అని నేను ఆశించాను. ఎందుకంటే ఒకవేళ నేను ముందు దాడి చేసి వారిని చంపి ఉంటే, మీరు ఇద్దరూ దేశం మొత్తం తిరుగుతూ, నన్ను దోషిగా చిత్రీకరించేవారు. నా జీవితం మొత్తం అందరికీ సంజాయిషీ ఇస్తూ ఉండాల్సి వచ్చేది” అన్నాడు.

ఇది ఈ నాటి వ్యభిచార మీడియా, కొందరు కుహనా మేథావుల పరిస్థితి.

మీడియా రంగంలో దొంగలు ఎక్కువయ్యారు.. మీరు కాదంటారా..???

నోట్ : ఈ స్టోరీ ఎవరు రాశారో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీడియాలో దొంగలు ఎవరో.. దొరలు ఎవరో మీరే తేల్చుకొండి.

Leave A Reply

Your email address will not be published.

Breaking