ఏపీ 39టీవీ 07 ఫిబ్రవరి 2021:
అనంతపురం జిల్లాలో తొలి విడత జరుగుతున్న కదిరి ప్రాంతంలో పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS ఈరోజు పరిశీలించారు. కదిరి మండలం కొండమనాయుని పాళ్యం జడ్పీ పాఠశాల పొలింగ్ లొకేషన్ సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్ష చేశారు. కదిరి డివిజన్ పరిధిలోని 12 మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఈనెల 9 న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లోని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, పోలింగ్ రొజున చేపట్టే పోలీసు బందోబస్తు, తదితర అంశాలను సమీక్షించారు. పోలింగ్ ప్రశాంత నిర్వహణకు గట్టిగా పని చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీతో పాటు కదిరి డీఎస్పీ భవ్య కిశోర్ , తదితరులు వెళ్లారు.