Header Top logo

The book “Panju (wolf) adventure story” has arrived పంజు (తోడేలు ) సాహస గాధ” పుస్తకం వచ్చేసింది.

The book “Panju (🐺wolf) adventure story” has arrived
పంజు (తోడేలు ) సాహస గాధ” పుస్తకం వచ్చేసింది…..

స్టోరీ టెల్లర్…మొహమ్మద్ మాహిర్..

"Panju (wolf) adventure story"
“Panju (wolf) adventure story”

బాల కథకుడు మొహమ్మద్ మాహిర్ గురించి ఒక్కమాట…!! ఇది ఎనిమిదేళ్ళ మొహమ్మద్ మాహిర్
(Mohammad Mahir) చెప్పిన కథ.!! ఎనిమిదేళ్ళ బాలుడు కథ చెప్పటమేంటని అనుకోకండి.
ఇలాంటి ఊహాత్మక కథలు ఎన్నో చెబుతున్నాడు. ఇది మాహిర్ సృజనాత్మక శక్తికి ఒక మచ్చు తునక మాత్రమే.మరి తెలుగులో ఈ పిల్లాడు రాయగలడా? అన్న అనుమానం కూడా రావొచ్చు. నిజమే మూడో తరగతి చదువుతున్న మాహిర్ తెలుగులో రాయలేడు. తన మాతృభాష(ఉర్దూ) లో చెబుతుంటే నేను తెలుగులో రాశాను. ఈ కథను రెండు మూడు రోజుల్లో చెప్పేశాడు. స్వేఛ్ఛ మనుషులకే కాదు..జంతువులకూ అవసరం. అయితే ఆ స్వేఛ్ఛ పరిధులు దాటితే ప్రమాదాల పాలు కావచ్చు. అప్పుడు ధైర్యం కోల్పోకుండా… ఆత్మస్థైర్యంతో నిలబడి ప్రమాదం నుంచి తాను బయటపడటమే గాక, తన తోటి జంతువులను’ పంజు’ అనే ఓ తోడేలు (Wolf) ఎలా కాపాడిందన్నది ? స్థూలంగా ఇందులోని కథ. అన్నట్టు…దీని సీక్వెల్” పంజు’ రిటర్న్స్”

(పార్ట్ 2) కూడా వుందట. అంతే కాదండోయ్..’పంజు’సాహస గాధల సీరీస్ తెస్తానంటున్నాడు. శుభం.! పిల్లల్లో మనకు తెలియనంత సృజనాత్మకత దాగివుంటుంది. అది బయట పడినప్పుడు భుజంతట్టి ప్రోత్సహిస్తే…. .భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. సృజనకారుడిగా తయారుచేస్తుంది. బాలకథకుడిగా… మొహమ్మద్ మాహిర్ తొలి ప్రయత్నం ఇది. మనసారా ఆశీర్వదించండి.! మీ ఆశీస్సులే నా మనవడు మాహిర్ కు కొండంత బలం. The book “Panju (wolf) adventure story” has arrived

ఈ కథ రాశాక నా మిత్రుడు సర్వేశ్వర రెడ్డికి చెబితే పుస్తకంగా తెద్దామన్నాడు. సీతగారు టైప్ చేసి, పేజీలు చక్కగా అమర్చి పుస్తకానికి ఓ అందమైన కొత్త రూపు తెచ్చారు.నా మిత్రుడు,చిత్రకారుడు. మొహమ్మద్ గౌస్కు ఈకథను మూడు ముక్కల్లో చెప్పినపుడు స్పాంటేనియస్ గా కేవలం 10 నిముషాల్లో అద్భుతమైన ముఖచిత్రం వేసి ఇచ్చారు..వీరందరికీ కృతజ్ఞతలు.

మీ,
ఎ .రజాహుస్సేన్.!!

Leave A Reply

Your email address will not be published.

Breaking