Header Top logo

అధ్యాపకులను ప్రోత్సహించే ఉద్దేశంతో అవార్డులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం:

మెరుగైన పరిశోధనల దిశగా అధ్యాపకులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఉత్తమ పరిశోధనా అవార్డును ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ నెల 3వ తేదీన ప్రదానం చేయనుంది.

యూనివర్శిటీ యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ మల్లేశం నేతృత్వంలో ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం పదిన్నర గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు, డీఆర్డీఓ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ రెడ్డి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బీజే రావులు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.

క్యాన్సర్ బయాలజీలో సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రఘు కల్లూరి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

పోటీ తత్వం పెరిగేలా మెరుగైన పరిశోధనలు జరిగేలా అధ్యాపకులు, పరిశోధకుల మధ్య సహృద్భావ పోటీ పెంచేందుకు ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ గతేడాది నుంచి ఉత్తమ పరిశోధనా అవార్డు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.

2022 లో ఈ అవార్డుకు గాను పదివేల రూపాయల నగదు, ప్రశంసా పత్రం, మెమెంటో ఇవ్వగా…. 2023కు గాను నగదు బహుమతిని 25వేల నగదుకు పెంచారు. కేవలం ఉస్మానియా అధ్యాపకులకే ప్రారంభించిన ఈ అవార్డు…. అనుబంధ కళాశాలలకూ విస్తరించారు.

ఈ ఏడాది 6 విభాగాల్లో ఈ అవార్డు ఇవ్వనున్నారు. అనుబంధ కళాశాలల వివిధ విభాగాల నుంచి దాదాపు 50 మంది అధ్యాపకులు అవార్డు కోసం దరఖాస్తు చేసుకోగా… క్యాంపస్ కళాశాలల నుంచి ఆయా విభాగాల డీన్లు అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఏదైనా పరిశోధనకు గాను పేటెంట్ హక్కు పొందిన వారికి, విజయవంతంగా ప్రాజెక్టు పూర్తి చేసిన వారికి అదనంగా ఉపకులపతి ఉత్తమ రీసెర్చ్ అవార్డు ఇస్తున్నారు. వీసీ ప్రొఫెసర్ రవిందర్ యాదవ్ ఆలచనల్లో ఒకటిగా వీసీ అవార్డును ప్రవెశపెట్టారని… ఏడాదిలో ఈ అవార్డు గుర్తింపు పొందందని యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం తెలిపారు.

గతేడాదితో పోల్చితో ఓయూ వీసీ ఉత్తమ పరిశోధన అవార్డు కోసం పోటీ పెరిగిందని…. పరిశోధనలల్లో నాణ్యత పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking