Header Top logo

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు… CEO ఆలూరు సాంబశివారెడ్డి

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు… CEO ఆలూరు సాంబశివారెడ్డి .
ఆలూరు సాంబశివారెడ్డి జన్మదినం సందర్భంగా 24 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నీలో 104 జట్లు పాల్గొన్నాయి. ఇవాళ బుక్కరాయసముద్రం మండలం జంతులూరు క్రీడా ప్రాంగణంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సునామి టైగర్స్ బుక్కరాయసముద్రం వర్సెస్ క్రేజీ బాయ్స్ నార్పల జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో సునామీ టైగర్స్ బుక్కరాయసముద్రం విజయం సాధించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి మరియు రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి మరియు వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ముందుగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దాదాపు 50 కేజీల కేక్ను క్రీడాకారులు అభిమానులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మధ్య ఘనంగా కట్ చేశారు. ఆనంద కోలాహలం మధ్య ఆలూరు సాంబశివారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
నియోజకవర్గంలోని యువతీయువకులకు ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంగా యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు.

క్రీడలు ఎంత అవసరమో చదువు కూడా అంతే అవసరమని చక్కటి చదువులు చదువుకొని ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. అలాగే 24 రోజుల పాటు నిరంతరం అందుబాటులో ఉంటూ క్రీడాకారులకు, అంపైర్లులకు, ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking