అనంతపురం జిల్లా: తేది: 01-02-21
ముగ్గురు అరెస్టు… 300 లీటర్ల నాటు సారా, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
కర్నూలు జిల్లా నుండి తాడిపత్రికి తరలిస్తూ పట్టుబడిన వైనం
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నాటు సారాలపై ప్రత్యేక నిఘా
కర్నూలు జిల్లా నుండీ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్ఠణానికి అక్రమంగా నాటు సారా తరలిస్తున్న ముగ్గుర్ని తాడిపత్రి రూరల్ UPS పోలీసులు పట్టుకున్నారు. వీరి నుండీ 300 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో … జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాల మేరకు అక్రమ మద్యం, నాటు సారాల కట్టడిపై పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. పక్కా రాబడిన సమాచారంతో తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు తాడిపత్రి – బుగ్గ రోడ్డు, సజ్జలదిన్నె గ్రామం వద్ద కర్నూలు జిల్లా అవుకు మండలం పిక్కర్లపల్లి తాండాకు చెందిన 1.వెంకటేష్ నాయక్ @వెంకట్, 2. నాన్కే నాయక్, 3. వెంకటేష్ నాయక్ @తోర్రోడులను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా అవుకు మండలం కొన్నేపల్లి నుండీ తాడిపత్రికి గోనేసంచుల్లో నాటు సారా పాకెట్లను ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
రూ. 2,31,890/- విలువ చేసే గుట్కా పాకెట్లు పట్టివేత
తాడిపత్రి-నంద్యాల రహదారిలోని గద్దరగుట్టపల్లి గ్రామం వద్ద అక్రమంగా ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్న రూ.2,31,890/- విలువ చేసే గుట్కా పాకెట్లను తాడిపత్రి రూరల్ యు.పి.ఎస్ పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రి మండలం వరదాయపల్లికి చెందిన పి.భాస్కర్ రెడ్డి, పి.మోహనరెడ్డి… పెద్దపప్పూరు మండల కేంద్రానికి చెందిన పి.సుదర్శన్ రెడ్డి, నారాయణరెడ్డి, రవికుమార్ రెడ్డిలు ఇందులో నిందితులు. వీరు పరారీలో ఉన్నారు