అల్లం పద్మక్క యాదిలో..
ఓయూలో హాస్టల్స్ మూసివేత..
ఆకలితో అలమటించే పిల్లలకు తల్లిలా ఆకలి తీర్చి..
ఆకలి కాగానే చాలా మంది ఉద్యమ కారులకు అల్లం పద్మక్క గుర్తుకు వస్తుండే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పని చేసిన ఉద్యమ కారులకు కడుపు నిండా బోజనం పెట్టి అమ్మలా ఆకలి తీర్చింది. అందుకే అమ్మల సంఘం అధ్యక్షురాలిగా అల్లం పద్మక్కఅందరి మన్ననలు పొందింది.
అల్లం పద్మక్క యాదిలో ఏడాది..
ఈ రోగాలు ఏందో.. మంచి వారిని హింసిస్తుంటాయి. అందరికి అన్నం పెట్టిన అల్లం పద్మక్కను ఆ రోగాలు వదులలేవు.
అరుదైన లూపస్, కిడ్ని సంబంధిత సమస్యలతో రెండు దశాబ్దాలకు పైగానే బాధ పడ్డాది. ప్రపంచాన్ని వణికించిన కరోనా కూడా పద్మక్కను వదులలేదు. అయినా.. కరోనాను జయించిన పద్మక్క ఆరోగ్యంకు డోకా లేదనుకున్నారు శ్రేయోభిలాషులు.
నిమ్స్ లో చికిత్స పొందుతూ..
ఆనారోగ్యంతో బాధ పడుతున్న పద్మక్కను నిమ్స్ హస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అయినా.. ఇరువై రెండు రోజుల అనంతరం ఆ నిమ్స్ లోనే పరిస్థితి విషమించింది. 22-02-2022 నాడు పద్మక్క తుది శ్వాష విడిచారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కష్టా, సుఖాలలో కలిసి ఉన్న తాను ఒంటరిని చేసి వెళ్లి పోయింది. అలా మన మధ్యలేకుండా పోయిన పద్మక్క సేవా, ఉద్యమ స్పూర్తిని గుర్తు చేసుకుంటారు తెలంగాణ ఉద్యమ కారులు.
అల్లం పద్మక్క ప్రధమ వర్ధంతి – సంస్కరణ సభ
22-02-2023న..
అల్లం పద్మక్కా మీకు జోహర్లు..
– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్