కలియుగం నుంచి కంప్యూటర్ యుగంలోకి వెళుతున్నాం. ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాం. అయినా.. ఇంకా మూఢ విశ్వాషాల ముసుగు వేసుకుని జీవిస్తున్నారు చాలా మంది. ప్రజల మూఢ విశ్వాషాలను ఆచరగా చేసుకుని మోసాలు చేసే వారు అడుగడుగున దర్శనం ఇస్తున్నారు.
ఇగో.. హైదరాబాద్ నగరం కొంపల్లిలో పొద్దున్నే వాకింగ్ కు వెళుతుంటే కనిపించిన దృష్యాం చూస్తే ఆశ్చర్యం వేసింది. ప్రజలు నడిసే రోడ్ మధ్యలో ఇస్తారి కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అందులో ఫ్రైడ్ రైస్ తో అన్నం.. ఐదు నిమ్మకాయలు.. తెల్లని కోడి కనిపించింది. Still with superstition
ఔను.. ఈ దేశంలో లాజిక్స్ కంటే మ్యాజిక్స్ ను ఇష్ట పడుతారు జనం. సైంటిస్ట్స్ కంటే సైబర్ దొంగలే ఫేమస్.. లాజిక్స్ కన్న మ్యాజిక్స్ అంటేనే అందరికి ఇష్టం. సైంటిస్ట్స్ కన్న సైబర్ దొంగలే ఫేమస్. బడిలో చదివే బాబుకన్న చేతబడి చేసే బాబా ఫేమస్. పచ్చె కామెర్ల రోగం కన్న పసుపు కుంకుమలే డేంజర్. అందుకే అమెరికా వాడు అణుబాంబుకు భయపడితే.. మనం నిమ్మకాయలకు భయపడుతున్నాం. పొరుగు దేశాలలో తీవ్రవాద తూటాలకు భయ పడితే మనం తాయత్తుకు భయపడుతున్నాం.