Header Top logo

Sri Sri Kalavedika Award శ్రీశ్రీ కళావేదిక అవార్డు

Sri Sri Kalavedika Award
అమ్ము.బమ్మిడి గారికి శ్రీశ్రీ కళావేదిక అవార్డు

“శ్రీశ్రీ కళావేదిక”

వారం వారం కవితా పోటీలో
“నేటి యువత” అంశానికి నేను రాసిన కవిత..!!
టాప్ 20 విజేతల్లో నా కవనాన్ని ఎంపిక చేసిన కళావేదిక బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు..!!

భారతావనికి కొత్త తరం కావాలి..!!
కులమత రాజకీయాల ఉచ్చులో చిక్కక
సామాజిక జాడ్యాలను తరిమికొట్టే
బాధ్యతాయుతమైన తరం కావాలి..!! (4)

అమానవీయ కల్లోలాలను నిలువునా పాతరేసి
శాంతియుత సమాజ స్థాపనకు పోరాడే
ధీరోదాత్తులైన తరం కావాలి..!! (7)

ఆడంబరాలతో జీవితాన్ని కరిగించక
శ్రమతో కండలు తిరిగే తరం కావాలి..!! (9)

మోహావేశాలకు బలై బతుకును చాలించక
నెత్తురే స్వేదంగా చిందించే శ్రమైక తరం కావాలి..!!(11)

అసాంఘికతకు ఆహుతి కాకుండా
లక్ష్యం కోసం తపించే లాక్షణిక తరం కావాలి..!!(13)

కాలయాపనతో ఏళ్ళు వెనక్కేయకుండా
కాలం కంటే ముందుగా పరుగులుతీసే
కత్తిలాంటి చురుకైన తరం కావాలి..!!(16)

ఉసరవల్లిలా రంగులు మార్చకుండా
ఇచ్చిన మాటకై ప్రాణం అడ్డుపెట్టే
పోరాటపటిమ గల తరం కావాలి!!(19)

సాంకేతిక పేరుతో మెదళ్ళకు సంకెళ్లేయకుండా
ఊరుకై పాటు పడే నవతరం కావాలి..(21)

అసమానతలను అణచివేసి తరతరాలకు స్ఫూర్తినిచ్చే
‘నేటి యువత’రం కావాలి..!!
వారే.. నవసమాజ నిర్మాణతలుగా
చరిత్రను తిరగరాయాలి..!! (25)

🌹🌹🌹🌹🌹🌹
అంశం : నేటి యువత
శీర్షిక : నవసమాజ నిర్మాతలు
తేదీ : 13.02.2022
🌹🌹🌹🌹🌹🌹🌹

Mukti Kshetra book review

అమ్ము.బమ్మిడి, జర్నలిస్గ్

Leave A Reply

Your email address will not be published.

Breaking