మెపా జాబ్‌మేళాకు -విశేష స్పందన
వరంగల్ : చేపల వృత్తిలోనే కాకుండా విద్యా, ఉద్యోగ రంగాల్లో సైతం పాగా వేయాలనే ఆలోచనతో ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం యూనియన్ (మెపా) ఆధ్వర్యంలో వరంగల్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హాలులో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు.
ఈ మేళాకు వివిధ హెచ్ డీఎఫ్‌సీ, ఐసిఐసీఐ, ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ కార్డ్, జీయో, శ్రీరాం తదితర కంపెనీల ప్రతినిధులు రాగా, ఉమ్మడి వరంగల్‌లోని వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా ఉద్యోగార్థులు హాజరయ్యాఐ 60 మంది ఎంపిక అయ్యారు.
ఈ కార్యక్రమానికి మెపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెపా ఎజెండా అయిన విద్యా, ఉపాధి, ఉద్యోగ, సాధికారత లక్ష్యంగానే ముందుకు సాగుతున్నామని అన్నారు. ఆ దిశగానే ఈ ఏడాది 10వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కార్యాచరణ చేశామన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో విస్తృత పరిచయాలు ఉన్న నర్సింహుల రాకేష్‌ను మెపా రాష్ట్ర ప్లేస్‌మెంట్ సెల్ కన్వీనర్‌గా నియమించినట్లు తెలిపారు.
మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ 2022-23 సంవత్సరాన్ని మెపా ఉద్యోగనామ సంవత్సరంగా తన ఎజెండా ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
జాబ్‌మేళాకు హాజరైన ఉద్యోగార్థులను వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్య్వూ చేసి 60 మందిని ఎంపిక చేయడం జరిగింది.ఇందులో మొదటి విడతగా తొలిరోజు 30 మందికి అక్కడిక్కడే ఆఫర్‌లెటర్లు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి మరుసటి రోజు ఆఫర్ లెటర్లు ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెపా ప్లేస్‌మెంట్‌సెల్ కన్వీనర్ నర్సింహుల రాకేష్
డాక్టర్ కట్ల శ్రీనివాస్, బాలబోయిన రమాదేవి, పిల్లి సునీల్‌కుమార్, ఉడుత మహేందర్,బోనాల రమేష్, పోలు పరమేశ్వర్, కౌటం రమేష్, తక్కెళ్ల నరేష్, భూమా భిక్షపతి,తాళ్ల రవి,నిమ్మల ప్రశాంత్,జీవన్, స్వామి ముదిరాజ్ ,జాబ్ ఆస్పిరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.