Header Top logo

Sodhi gurus doing pichcholas పిచ్చోళ్లను చేస్తున్న సోది గురువులు

Sodhi gurus doing pichcholas
పిచ్చోళ్లను చేస్తున్న సోది గురువులు

సోషల్ మీడియా.. పొద్దున లేసిన నుంచి పండుకునే వరకు చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. మానవుడు విజ్ఞానంగా అభివృద్ది చెందడానికి ఉపయోగపడాల్సిన ఈ సోషల్ మీడియా పక్క దారి పట్టిస్తోంది. మానవుడు కలియుగం నుంచి కంప్యూటర్ యుగంలో ప్రయాణం చేస్తుంటే ఇంకా మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తూ కొందరు పోస్ట్ లు పెడుతున్నారు. మూఢ నమ్మకాలను ప్రొత్సహించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరిస్తోంది రాజ్యలక్ష్మీ బీరం గారు.  ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ ఆలోచింప చేస్తోంది.

Sodhi gurus doing pichcholas పిచ్చోళ్లను చేస్తున్న సోది గురువులు

సోషల్ మీడియాలో..  అందరినీ పిచ్చోళ్ళను చేస్తున్నారు. అమాయకులతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా లేడీస్ వాళ్ళ టార్గెట్ !! దిష్టి: ‘దిష్టి ‘అంటే, ప్రాక్టికల్ గా ఆలోచించకపోవడమే తప్ప ఇంకేం కాదు. చిన్నప్పుడు అమ్మ దిష్టి తీసిన విధానం, అది ఎలా పోతుందో చెప్పిన విషయాలు ఈ రోజు గుర్తుకొచ్చి ఈ పోస్ట్ రాయాలనిపించింది. పిల్లలు active గా ఉన్నంతవరకు ok కానీ కొంచెం dull అయితే చాలు దిష్టి తగిలిందని దిష్టి తీసేవాళ్ళు పెద్దోళ్ళు.

ఆర్ ఎంపి డాక్టర్ వద్దకు

అయినా కూడా తగ్గకుండా వాంతులు చేసుకోవడమో, జ్వరం రావడమో జరిగితే ఊర్లో ఉన్న ఆర్ ఎంపి డాక్టర్ వద్దకు వెళ్లి టాబ్లెట్ తీసుకొని వేసేవాళ్ళు. కాసేపటికి తగ్గిపోతుంది. ఆ టాబ్లెట్ ఎలా పని చేస్తుందో అవగాహన లేక tablet వేసిన తర్వాత కూడా రకరకాల దిష్టి తీసేవారు. తగ్గిన తర్వాత దిష్టి తీయడం వల్లనే తగ్గిందని నమ్మేవారు. ఫస్ట్ అయితే చీపురు పుల్లలు మనిషి చుట్టూ తిప్పి దిష్టి పోవాలని ఏవో నాలుగు మాటలు అనేసి ఆ పుల్లలను మంటల్లో వేసేవారు. అవి ఎండు పుల్లలైతే టపటపా శబ్దం వచ్చేది. కాస్త తడి కనుక ఉన్నట్లయితే తక్కువ శబ్దం వచ్చేది. ఎంత ఎక్కువ శబ్దం వస్తే అంత ఎక్కువ దిష్టి ఉంది అనుకునేవాళ్లు. ఆ శబ్దం వచ్చేటప్పుడు చూశావా ఎంత దిష్టి ఉందో అనేవారు. Sodhi gurus doing pichcholas

కుండ దిష్టి కూడా తీసేవారు పసుపు, సున్నం కలిపిన నీళ్లతో దిష్టి తీసి ఆ నీళ్లు ఉన్న plate లో ఒక వత్తి వెలిగించి పైన పాత కుండ ఒకటి బోర్లించేవారు. అందులో జరిగే కెమికల్ రియాక్షన్ వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన ఆ కుండ, నీళ్లు పీల్చుకునేటప్పుడు వచ్చిన శబ్దమే దిష్టి అనుకునేవాళ్లు. ఇప్పుడు అన్నీ explain చేసి చెప్తుంటే అమ్మ చక్కగా అర్ధం చేసుకుని మూఢనమ్మకాలు వదిలేస్తూ ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. అందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.

చదువుకున్న వాళ్లే మూఢనమ్మకాలు

చదువుకున్న వాళ్లే ఎక్కువ గా మూఢనమ్మకాలు పాటిస్తూ ఊహల్లో తేలిపోవడం చాలా వింతగా అనిపిస్తుంది నాకు. ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే తప్ప ఈ మూఢనమ్మకాలు వదల లేరు. ఇప్పుడు ఏ పిల్లల్ని చూసినా కాలికి నల్లదారం, మెడలో ఒక నల్లదారం. జంతువుల్ని మెడకు తలుగు వేసి గుంజకు కట్టినట్టు ఉంది ఆ పిల్లల్ని చూస్తుంటే. TV లో, యూట్యూబ్ లో సోది గురువులందరూ చేరి మనుషుల్లో ఉండే సహజ భయాలను ఇంకా పెంచి పోషిస్తున్నారు. పెద్దోలందరూ కూడా కాలికి నల్ల దారం కట్టుకోవడం, పూజలు విపరీతంగా చెయ్యడం ఎక్కువైపోతోంది. ఎవరి mind తో వాళ్ళు ఆలోచించుకోకపోతే ఈ సోషల్ మీడియా సోది గురువులు మాత్రం అందరినీ పిచోళ్లను చేసి ఆడుకోవడం ఖాయం. ముఖ్యంగా లేడీస్ వాళ్ళ టార్గెట్. Be care ful with సోది గురువులు.

Sodhi gurus doing pichcholas పిచ్చోళ్లను చేస్తున్న సోది గురువులు

రాజ్యలక్ష్మీ బీరం, రచయిత



Leave A Reply

Your email address will not be published.

Breaking