Header Top logo

Satish Chander Book – Illustration సతీష్ చందర్ బుక్ – పదచిత్రం

MY BOOK A DAY-3

Satish Chander Book – Illustration
సతీష్ చందర్ బుక్ – పదచిత్రం

కూర్చున్న వాణ్ణి ఎప్పుడు చివాల్న లేచిపోతానో తెలీదు. మాట్లాడుతూనో, రాస్తూనో, వింటూనో నన్ను నేను విడిపోతాను. నాకు నేను కాకుండా పోతాను. అప్పుడే కదా.. ఎవరికన్నా ఏదన్నా అయ్యేది..!?

అవును. నేను అలా వెళ్ళిన కొన్ని క్షణాలూ ఏదో ఒకటి అవుతున్నాను. కొడుగ్గా, ప్రియుడిగా, స్నేహితుడిగా, బికారిగా, వోటరుగా.. ఇలా. ఒక్కొక్క సారి జెండర్లూ, మతాలూ, ప్రాంతాలూ మారిపోతాయి. భార్యనో, కూతుర్నో, తల్లినో అయిపోతుంటాను.
కుర్చీ దిగివెళ్ళతానేమో.., అన్నీ నేలబారు వేషాలే. అప్పుడు తట్టదు కానీ తర్వాత స్పురిస్తుంది: ‘నా ఏడుపు నేను ఏడవవచ్చు కదా! మరీ ఇన్ని ఏడ్పులా?’ అని. మళ్ళీ మామూలే. ఎవరో ఒకరి ఏడ్పు ఏడ్వకుండా పూట గడవటం లేదు.దానినే కవిత్వమని నాకు నేను నచ్చచెప్పుకుంటూ వస్తాను. అలా అనుకునే రాస్తాను. ఒక్కొక్కసారి దాస్తాను . ఇలా ఎప్పుడోకప్పుడు తీస్తాను కూడా. ఇప్పుడు ‘పదచిత్రం’ అయ్యింది. రేపు మరొకటి కావచ్చు. ఇలా:

ఉనికి

ఎంతో చీకటి

కొంతే వెలుతురు

అతి పెద్ద నల్లని కాన్వాసు పై

పిసరంత తెల్ల రంగు చిమ్మినట్లు.

చుట్టూ వున్న మహాసముద్రాన్ని వదలి

నాటు పడవనే చూసినట్టు,

ఆవరించిన రాత్రిని విస్మరించి

వెలిగిన అగ్గిపుల్లకు ముగ్థులమవుతాం.

పగలూ అంతే.

అంత పెద్ద సూర్యకాంతిని వదలి

చిన్న మబ్బు నీడకు పరవశిస్తాం.

విశాలమైన నుదుటిని చూడకుండా

చిన్న బొట్టుకు చిక్కుకుంటాం.

-సతీష్ చందర్

కవిత్వం రాయకుండా జీవించలేను; కవిత్వాన్ని జీవించకుండా రాయలేను.

’పదచిత్రం‘ లోని వన్నీ ఇలా అతి చిన్న కవితలు. 500 వరకూ వున్నాయి. అన్నింటికీ బొమ్మలు నేనే వేసుకున్నాను.

ఈ పుస్తకం ’హైదరాబాద్ నేషనల్ బుక్ ఎగ్జిబిషన్ రైటర్స్ స్టాల్ (152-153)లో కూాడా దొరుకుతుంది.

Satish Chander Book Booth bungalow

సతీష్ చందర్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking