ఏపీ39టీవీ న్యూస్ జూన్ 13
గుడిబండ:- జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్ ఆదేశాల మేరకు కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో గుడిబండ ఎమ్మార్వో మహబూబ్ ఫీరా రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి ఎంపీడీవో నరేంద్ర కుమార్ ఈవోఆర్డి నాగరాజు నాయక్ మెడికల్ ఆఫీసర్ వెంకటచిరంజీవి కోవిడ్ రెండవ దశలో పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ వాలంటీర్లు తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే తప్పనిసరిగా చేయాలని మరియు వాక్సిన్ వేయించుకోలేనటువంటి వారిని గుర్తించి వ్యాక్సింగ్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సిబ్బంది ఎంపీడీవో సిబ్బంది గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు ఆశా వర్కర్లు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ