Header Top logo

Reddish poetry ఎర్రగడ్డ కథ

Reddish poetry

ఎర్రగడ్డ కథ

డాట్రుగారూ.. నాకెందుకో అనుమానంగా ఉంది. మీరు పూర్తిగా అన్ని పరీక్షలూ చేయండి.

ఎందుకంత టెన్షన్ పడుతున్నారు. ఆయనకేం కాలేదు బాగానే ఉన్నారు. మీరే ఎందుకో ఆందోళన పడుతున్నారు. చెప్పండి అసలేం జరిగింది?

ఏం జరగడమేమిటి డాట్రుగారూ.. పెళ్లై ఈ పాతికేళ్లల్లో ఎన్నడూ లేంది.  దీపావళి అంటూ స్వీట్లు కొనుక్కొచ్చారు డాట్రుగారూ. స్వీట్లు కొనుక్కొచ్చారు. ఏమైందో ఏమో మీరే పరీక్షలు చేసి చెప్పాలి. మా అన్నయ్య వచ్చే వరకైనా ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్మెంటు చేయండి డాట్రుగారూ.. పోనీ ఎర్రగడ్డ తీస్కెళ్లి చూపించమంటారా?

దీపావళికి స్వీట్స్ తేవడం కామనే కదమ్మా.. దీనికే ఎందుకు అంత ఖంగారు పడుతున్నావు? ఈ మాత్రం దానికే ఎర్రగడ్డ అంటున్నారు మరీనూ.. మీకు తెలీదు డాట్రుగారూ.. మా ఆయన చిన్నప్పట్నించీ ఎర్రగడ్డ కవిత్వం రాస్త ఉండేవాడు. Reddish poetry

ఎర్రగడ్డ కవిత్వమా ?  అదే డాట్రుగారూ ప్రోగ్రెసివ్ పోయిట్రీ … రివల్యూషనరీ పోయిట్రీ అంటారే అదీ … అట్టాటి ఆయన ఈ పాతికేళ్లలో ఎన్నడూ లేంది. అని ఇంకా ఆవిడ అంటూండగానే డాట్రుగారే వాక్యాన్ని పూరించేశారిలా.

దీపావళి అంటూ స్వీట్లు కొనుక్కొచ్చారు డాట్రుగారూ..

మీకు వేళాకోళంగా ఉంది డాట్రుగారూ.. సరే ఎవర్నేమనుకుని ఏం లాభం మీరే వార్ని కాస్త మామూలు మనిషిని చేయాలి. ఎంత ఖర్చైనా పర్లేదు డాట్రుగారూ.. మా ఆయన పేరుతో వాళ్ల స్వగ్రామంలో ఓ రెండు వందల గజాల స్థలం ఉండాలి. అదమ్మేసైనా మీ ఫీజిచ్చేస్తాను.

అప్పుడు నిజంగానే కవిగారికి పిచ్చెక్కేసింది. Reddish poetry

Reddish poetry

Bharadwaja Rangavajhala, Journalist

Leave A Reply

Your email address will not be published.

Breaking