AP 39TV 22 ఏప్రిల్ 2021:
మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి మాస్క్ లు అందిస్తూ కరోనా పై అవగాహన కల్పిస్తూ నగర మేయర్ మహమ్మద్ వసీం వినూత్న కార్యక్రమం చేపట్టారు. గురువారం ఉదయం నగర మేయర్ మహమ్మద్ వసీం సూర్య నగర్ ప్రాంతంలో పర్యటించారు. అనేక మంది టీ స్టాల్ ప్రాంతాల్లో మాస్క్ లు లేకుండా ఉండటంతో వారికి మేయర్ వసీం మాస్క్ లతో పాటు శ్యానిటైజర్ లు అందించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచించారు. రోజు రోజుకూ నగరంలో కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీ స్టాల్ నిర్వాహకులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని టీ స్టాల్ ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం సాయి నగర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య సమస్యలును పరిశీలించారు.మేయర్ వెంట కార్పొరేటర్ లు బాలాంజీనేయులు, అనిల్ కుమార్ రెడ్డి, ఎం హెచ్ ఓ రాజేష్ ,వైకాపా నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.