– తీవ్రమైన నేరాలను 11.2% తగ్గించాము.
– ప్రజా ఫిర్యాదులపై జిల్లా వ్యాప్తంగా సగటున 4.5 నిమిషాల్లో పోలీస్ సేవలను అందించాము.
– వ్యవస్థీకృత నేరాలను అదుపు చేశాం.
– అనుమానితులుగా భావించి ఎనిమిది వేల మందికి పైగా అనుమానితులని తనిఖీ చేయడం జరిగింది.
రాజేంద్రప్రసాద్ IPS, ఎస్పీ సూర్యపేట.
జిల్లా పోలీసు యొక్క వార్షిక నివేదికను ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ గారు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశం నందు వార్షిక నివేదిక గురించి వివరించారు.
జిల్లాలో నమోదవుతున్న నేరాలకు సంబంధించి తీవ్రమైన నేరాలను 11.2% తగ్గించామని నేరాలు తగ్గటం అనేది సంతోషకరమైన విషయమని ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ గారు ఈ సందర్భంగా తెలిపారు.
అలాగే ఈ సంవత్సరం కోర్టు సంబంధించి కేసులలో 4041 ఎఫ్ఐఆర్ కేసులను, 2600 ఈ పెట్టి కేసులను మరియు 11 వేల ఇతర కేసులను పరిష్కారం చూపడం జరిగింది అన్నారు. 45 మంది నేరస్తులకు జైలు శిక్షలు పడేలా పనిచేశామని వీరిలో ఆరుగురు నేరస్థులకు జీవిత ఖైదు పడేలా కృషి చేశామని చెప్పి తెలిపారు
జిల్లాలో వ్యవస్థీకృత నేరాలను పూర్తిగా నిరోధించామని ఎన్ఫోర్స్మెంట్ పెంచి ప్రతిరోజు 3 విడతల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 144 మందిపై 55 కేసులు నమోదు చేసి 2.2 టన్నుల గంజాయిని సీజ్ చేశామని ఇద్దరిపై పిడి యాక్ట్ నమోదు చేశామని సీట్ చేసిన గంజాయిలో 1.4 టన్నుల గంజాయిని కాల్చి నిర్వీర్యం చేశామని అన్నారు,
గంజాయి ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ అయిన ఏ మార్గంలో వెళ్లిన గంజాయిని సీట్ చేశామని జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి కాకుండా చూసామని తెలిపారు. 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించి 4 నిమిషాల.5 సెకండ్లలో బాధితులకు పోలీసు సేవలను అందించామని తెలిపారు చట్టవుల్లంఘన చర్యలకు పాల్పడి శాంతి భద్రతలకు భంగం కలిగించతారు అనే ఉద్దేశంతో 2495 మందిని కస్టడీలకు తీసుకొని 1100 మందిపై బైండోవర్ చేయించడం జరిగింది అన్నారు.
అలాగే నిత్యo వాహనాలు తనిఖీలు చేస్తూ జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరంలో ఎనిమిది లక్షలకు పైగా వాహనాలని తనిఖీ చేశామని అనుమానం ఉన్న సుమారు 8 వేల మందిని తనిఖీ చేసామని, ఈ తనిఖీలలో ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టం, ఫేషియల్ రీడింగ్ సాంకేతికతను సద్విని చేసుకోవడం జరిగింది అన్నారు డిజిపి గారి ఆధ్వర్యంలో ఫంక్షనల్ వర్టికల్ సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు
యజమానులు తీసుకెళ్లకుండా ఉన్న 485 వాహనాలను బహిరంగంగా వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆర్మీ నియామక ర్యాలీకి 2700 మంది అభ్యర్థులు రాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించామన్నారు.
పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న 400 మంది నిరుద్యోగ పేద అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం సహకారంతో ఇండోర్ ఔట్డోర్ పరీక్షలు ఎందుకు ఉచిత శిక్షణ ఇచ్చామని స్టడీ మెటీరియల్స్ అందజేశామని ఆర్మీ నియమాకలకు సిద్ధమవుతున్న 250 మంది నిరుద్యోగ యువతకు గ్రౌండ్ ఫెసిలిటీ కల్పించి శిక్షణ ఇచ్చామన్నారు పోలీసు ఉచిత శిక్షణ పొందిన వారిలో 158 మంది వరకు ఫైనల్ ఎగ్జామ్స్ కు సెలెక్ట్ అయ్యారని తెలిపారు. 2013 సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని ఎస్పీ గారు అన్నారు.
జిల్లాలో దొంగతనాలకు గురైన సొత్తును 58% రికవరీ చేశామని అన్నారు, రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగామని తెలిపారు, వాహనాలను తనిఖీ చేస్తూ మూడు లక్షల 79 వేల వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు, 133 తీవ్రమైన నేరాలను నమోదు చేశామని తెలిపారు,
మద్యం వాహనాలు నడుపుతున్న 14140 మందిపై కేసులు నమోదు చేశామని వీరిలో 60 మందికి జైలు శిక్షలు పడ్డాయని తెలిపారు, బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై 8148 కేసులు నమోదు చేశామని 5400 మంది మీ అరెస్టు చేశామని అన్నారు, ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్మైల్ ద్వారా 180 మంది పిల్లలను గుర్తించామని తెలిపారు. మహిళలకు వేదింపులకు సంబంధించి 645 కేసులు నమోదు చేశామని అన్నారు.
అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి 560 కేసులు నమోదు చేసినట్లు. విద్యార్థులు, మహిళలు బాలల రక్షణలో జిల్లాలు షీ టీమ్స్ మరియు భరోసా సెంటర్స్ పని చేస్తున్నాయని అన్నారు. షీ టీమ్స్ బాగా పనిచేసే జిల్లా వ్యాప్తంగా 242 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది 110 ఫిర్యాదులు రాగా 95 కౌన్సిలిన్సు నిర్వహించడం జరిగింది 41 స్పాట్ కేసులను నమోదు చేయడం జరిగింది, అలాగే భరోసా సెంటర్ నందు 122 కేసుల్లో 120 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
విధుల నిర్వహణలో బాగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి ఈ సంవత్సరం అందించడం జరిగింది.
శాంతిభద్రతల పరిరక్షణను అనుక్షణం పనిచేస్తూ ప్రజల దన మాన ప్రాణాల ఆస్తి రక్షణలో పోలీసు నిర్విరామంగా పనిచేస్తున్నది, సాంప్రదాయ పండుగలు జాతరలు సభలు ర్యాలీలు సమావేశాల్లో ఎలాంటి అవాంఛనీయడం జరగకుండా చేసి నాణ్యమైన పోలీస్ సేవలు అందించడానికి ప్రజల మద్దతుతో ఆధునిక పోలీసింగ్ నిర్వహిస్తున్నామని బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో పారదర్శకంగా పనిచేస్తూ శాంతిభద్రతలను కాపాడుతున్నామన్నారు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ప్రణాళికతో ముందుకెళ్తున్నమని తెలిపారు.