Header Top logo

అణ గారిన వర్గాల కోసం పూలే పోరాటం – సాకే నరేష్

అణ గారిన వర్గాల కోసం పూలే పోరాటం – సాకే నరేష్

అనంతపురం : ఏప్రిల్ 11

బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 194 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సాకే నరేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు. ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అని చెప్పవచ్చు. పూలే విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. సమాజం విద్యా పరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని ఆశించారు.

సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పూలే పని చేశారు. జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో పూణే జిల్లాలోని ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పూలే ప్రజల్లో వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకొచ్చారు.
పూలే 1864 గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కేంద్రం ద్వారా వితంతువులైన గర్భిణీ స్త్రీలకు ఆయన అండగా నిలిచారు.

పూలే శూద్ర వర్ణాల్లో వివక్షకు గురవుతున్న కులాల గురించి పోరాడటంతో పాటు అగ్ర వర్ణ వితంతువుల పునర్వివాహం కోసం కృషి చేశారు. ‘సేద్యగాని చర్మకోల’, ‘గులాం గిరి ‘ అనే గ్రంథాలను పూలే రచించారు. శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి బ్రిటిష్ వారితో పాఠశాలలను ఏర్పాటు చేయించారు. 1872 లో ఒక బ్రాహ్మణ యువతికి పుట్టిన బిడ్డనే ఫూలే దంపతులు దత్తపుత్రునిగా స్వీకరించారు. బాలునికి యశ్వంత్ అని పేరు పెట్టారు.

పూలే స్థాపించిన సత్యశోధక సమాజం . భగవంతుడికి భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండవద్దని పిలుపునిచ్చింది. ఆ కాలంలోనే మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా కూడాసేవలందించారు. దీనబంధు అనే పత్రిక ద్వారా బీదల, కార్మికుల సమస్యలు సమాజానికి తెలిసేలా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ జ్యోతిబా పూలే తన గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పదనం సులభంగా అర్థమవుతుందన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీసీ సురేష్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ , ఉపాధ్యక్షుడు లక్ష్మి పతి నాయక్ , సహాయ కార్యదర్శి హరి ,ప్రచార కార్యదర్శి ప్రసాద్ , కిరణ్ ,అరిఫ్ ,మనోజ్ ,కార్తీక్ ,మురళి , నారాయణ స్వామి ,శ్రీనివాసులు

Leave A Reply

Your email address will not be published.

Breaking