Header Top logo

Pittala Srisailam Muchukunda Muchatlu-ముచుకుంద ముచ్చట్లు-03

Pittala Srisailam Muchukunda Muchatlu పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-03

“పావు కిలో మటన్ ,అది వద్దంటే, ఆఫ్pittala కిలో చికెన్ తెస్తే , అదో గొప్ప మనకి. తక్కువోల్లం కదా బిడ్డా మనం.. తెనుగోల్ల ఇంట్ల పుట్టిన మనలాంటి కింది కులాలోల్లు, తాగుల్లకు, తిండికి  అప్పు సప్పు చేసి ఖర్చు పెడ్తరన్న మస్తు చెడ్డ పేరుంది.అది బలుపు అన్న సంగతి , సార్కలు తేలినంక తెలుస్తది. అంతో ఇంత నల్గుట్ల తిరుగుతున్న మనం కూడా , ‘లోప్క తాగుడు- కడ్క తినుడు’ లాంటి మాటలు పడదామా?  ‘తాగి తందనాలు ఆడుతం’ అన్న నింద , మనలాంటి కింది కులాలకు తప్పదా?! లేదంటే చెప్పుండ్రి, ఇంకా ఈ చెడ్డ పేరు మోద్దామా తేల్చుకోండ్రి” అని నా ఇద్దరు బిడ్డలు ‘పిట్టల తెలంగాణ కోకిల’ కు, ‘పిట్టల మూసీ ‘ కి ‘ రెడ్డొచ్చే మెుదలాడు’ సామెతలాగా, చెప్తనే ఉంటా.. కాని మూసీ విన్నట్టు చేస్తది. మల్ల పాత పాటే అందుకుంటది.

గా ముచ్చట చెప్త వినుండ్రి…

పొయిన ఆదివారం మా ఊర్లో  (అంకుషాపూర్, గట్కేసర్ మండలం) బోనాలు..  మా చిన్న బిడ్డ మూసీ , ‘మనం కూడా బోనం  చేస్దాం’ అని , ఎప్పటోలే వాళ్ల అమ్మతో ప్రతి బోనాల పండుగపుడు కొట్లాటనే.. అట్లాని దేవుండ్ల మత్తు లేదు. ఒక్కనాడు వాలంతల వాళ్లు గుడికి పోయేటోల్లు కాదు. అంతో ఇంతో ఆలమ్మనే ఇంట్లో దేవుండ్ల పోటోలు పెట్టుకొంటది. పిల్లలు అటు దిక్కు కూడా పోరు. కాని బోనం అంటే అదో మురిపెం!

మా ఆమే కృష్ణవేణితో, మూసీ ముచ్చట్లు ఇట్లా సాగినవి…

“అసలు మీ కడుపులో మేమెందుకు పుట్టినం? గుల్లు, గోపురాలకు పోకపోతిమి.. అవి మనయి కావు బాపనోల్లయి అంటిరి. (పుట్టుక తోటి , బాపనోల్ల ఇంట్లో పుట్టినోల్లు మాత్రం కాదు. బ్రాహ్మణిజాన్ని మెాసెటోల్లు. ఆలు శూద్రులైన అతి శూద్రులైన ఒక్కటే ). మనం సుద్దరోల్లం (శూద్రులు). కాబట్టి , మన దేవతలు అమ్మ దేవతలైన పెద్దమ్మ, పోషమ్మ, మైసమ్మ లంటిరి. మాకు తెలివొచ్చినప్పటి నుంచి , బోనం చెయ్యకపోతిరి. అంతకు ముందు చేసిండ్రో చెయ్యలేదో మీకే తెలియాలే. ఏంది ఎందుకు జెయ్యరంటే , మనకు స్వంత ఇల్లు లేదని తప్పిస్తిరి. పండుగలకు పబ్బాలకు ఊరికి పోతే , ఉండడాని కని , ఉత్తగనే ఐదేండ్ల నుంచి మంగల్లోల రేకుల రూంకు  కిరాయి కడుతున్నం కదా.

మీరేమో , మనం కడ్తే గిడ్తే , మన ఊర్లో ఏ దొరకు లేని అద్దాల మేడ లాంటి ఇల్లు కట్టినంక , బోనాలు చేస్దామని  మరిపించవడితిరి.. అందరు ఆడపిల్లలు బోనం ఎత్తుకొని పోతుంటే , సూడబుద్ది కాక అడుగుతున్నం. బంగారు నగలు ఏసుకొని , పట్టు బట్టలు కట్టుకొని , బోనం ఎత్తుకొవచ్చని ఆశ అంతే. కానీ , నీ మెుకానికే  ఒక్క పట్టు చీర లేకపాయే. ఎంత గరీబోడన్న సరే , పెండ్లికి పట్టు చీర పెడ్తరు. నీ మెుకానికి అది కూడా లేకపాయే. ఈ భూమి మీద ఏడ్నన్న పట్టు చీర లేని ఇల్లుందా చెప్పూ. అట్లనే నీకు  మెుత్తంగా పుస్తెల తాడు, కమ్మలు కల్సి రెండు తులాలు కూడా మించవు. మాకు ఇద్దరికి కలిపి అద్ద తులం బంగారం గొలుసు తప్ప ఇంకేమి లేకపాయే. ఏమన్నంటే రాబర్ట్ కియెాసాకి రాసిన  ‘Rich Dad – Poor Dad’ పుస్తకం ముందల పెడ్తరు. పండుగ పేరుతోనన్న బంగారం, పట్టు చీరలు కొంటరని ఆశ అంతే. కాని రోల్ గోల్డ్ మాత్రం జో ‘హోనా హో , లేలేవ్’ అని తీస్కొమంటరు. చిన్నప్పుడు ఏమెా రోల్డ్ గోల్డ్ ఏసుకునేటోల్లం. ఇప్పుడు వాటి జోలికే పోతలేం. కాని, నాకు తెలువక అడుగుత. నాన్న తెలంగాణ ఉద్యమప్పుడు లెస్స తిప్పిండు గద?! మమ్మల్ని. ‘ఔర్ ఏక్ దక్కా , తెలంగాణ పక్కా ‘ అని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలే అని , తిరగని ఊరు లేదుకదా.. ఇక దసర, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగ లపుడేమన్న ఓ కోడిని గాని, యాటని  కోసిండ్రానే.. మనం తక్కువోల్లం , పండుగల పేరుతో, వీకెండ్ పేరుతో దుబారా ఖర్చు చెయ్యద్దని , పావు కిలో మటన్ లేకుంటే – ఆఫ్ కిలో చికెన్ తెస్తే , అదో గొప్పనుకుంటిిమి. మనకన్న తక్కువ పైసలు ఉన్నోల్లు కూడా, జోరుగ తాగడానికి తినడానికి ఖర్చు చేస్తున్నరని.. వాళ్లలాగ మనం ఉండొద్దన్నా కూడా , అర్ధం చేసుకున్నం.. మేము కడుపుల పడ్డప్పటి నుంచి , ఒక బర్త్ డే లతో సహా, మాకు చేయాల్సిన ఏ ఫంక్షన్ చెయ్యక పోతిరి గదనే. మీరు దావత్ చెయ్యకుంటే, నాయినమ్మ మాకు చీరకట్టిస్తే మురిసిపోయినం. నాన్న వంద రూపాయల స్లిప్పర్స్,  ఐదు వందల లోపు బట్టలు ,అవి కూడా వృత్తి కళాకారులను గౌరవించాలని చేనేత బట్టలు ఏసుకుంటుండని.. మేము కూడా పోచంపల్లి చేనేత బట్టలు తొడ్కుంటున్నం.. మమ్ముల చూసి ఇంకొంత మంది కూడా చేనేత బట్టలు కొన్నామని , మాకే చెప్తే మురిసిపోయినం గదనే. అట్లనే పుస్కున సస్తే , బొందపెడ్తే కుల్లిపోయి పురుగుల పడ్తం. బొంద పెడ్తే ఎవరికి పనికి రాం. మనం సస్తే కూడా, మన బాడి మాట్లాడాలంటే , అందుకే ,అదే బాడీని డొనేట్ చేస్తే పది మంది అవుతమని , గంజి ఈశ్వర లింగం అంకుల్ నడిపే అమ్మ అవయవ దానం పౌండేషన్ కు ,బాడి డొనేట్ చేస్తిమి. లింగం అంకుల్ మన బాడీ దొరకకపోతే.. ఎడ్నన్న రోడ్ యాక్సిడెంట్ల పోతే మన బాడీ పాట్లన్న ఎవరికన్న పనికొస్తయి అంటే , సెకండ్ ఛాయిస్ గా

జీవన్ దార్ ఫౌండేషన్ కు , అవయవ దానం కూడా ఎప్పుడో  రాసిస్తిమి కద. అదికాక ,సావు చేస్తే సచ్చినోల్లు సావంగ , ఉన్నోల్లకు సావు ఖర్చులు తడిసి మెాపడు అవుతయని అనుకుంటిమి. పొయినేడు నాయనమ్మ సచ్చిపోతే బొంద బెట్టినమని బాధ పడ్తిమి. కొడుకులకు  బారం పెట్టొదని , నాయినమ్మ సావు ఖర్చు కోసమని ,తాత తాలూకా పెన్షన్ బ్యాంకులో జమ చేసుకొని సచ్చింది. సావు దినాల ఖర్చు కాంగ , మిగిలిన పైసల్ పంచుకుంటిమి. లేకపోతే కష్టమవుతుండే. సావైన, పండుగైన ,మనోల్లకు తాగుడు తినుడు తప్పదాయె. ఇది కూడా మన ఆడోల్లకే మెంటల్ టెన్షనే కద.

ఇంpittala familyకా లో ఫ్రొఫైల్ – తొక్క తోలు అని , మనం ఉన్న దాంట్లో ఉందామంటిరి.కాని  ఈల్ల దగ్గర డబ్బు సంచుల డంప్ ఉందని, ఆడోక్కడు ఈడొక్కడు  బనాయిస్తుంటే బరించవడ్తిమి. కాని, మెున్న నెల హాస్టల్ ఫీజు కట్టకపోతే, ఆడ మా ఇజ్జత్ పోవట్టే.  సూద్దరోళ్లంత గింతే.. మారరు.. అనొద్దని కదా, మీరూ తాగుడు తినుడుకు ఖర్చు పెట్టరని అర్థం అయ్యింది. మనల్ని సూసి ఒక్కరన్న మారుతరా..”ఊరంత ఒక్కదిక్కైతే , ఉలిపి కట్టో దిక్కు ” లెక్కున్నం మనం. సూద్దాం… అంటూ ప్రతి యేటా గిట్లనే” అంటూ,మా మూసీ మాత్రం ఏడ్సుకుంట , చాలా కోపడుతది. పెద్దబిడ్డ తెలంగాణ కోకిల మమ్మల్ని అర్థం చేసుకునే స్టేజిలో ఉంది. దీంతో సందుల బొందని,మా కృష్ణవేణి నన్ను ఉతికి ఆరేస్తది. నేను మాత్రం ఎప్పటి తీరుగ ,దులుపుకొని బైటపడ్త. లేకుంటే బతుక వశమా!? అచ్చం మన లాంటోల్లే , అప్పులు జేసి ,చావులను కూడా పెండ్లిళ్ల లాగ చేస్తుండ్రని , మా బాధ. కొంత కరోనా మార్చింది. కాని మా బాధ అందరి బాధే! అందరం కలిసి తాగుడుకు,తినుడుకు కోట్ల రూపాయలు పోస్తున్నం. అందులో నాలాంటోల్లు ఉండొద్దని ఆశ అంతే.

ఉంటా మరి. ఇట్ల ఉన్నదున్నట్లు మీకు చెప్తున్న… మీరేమన్నా అనుకోండ్రి . మీరేమి చెప్పినా వింట. మీరు కామెంట్స్ రాసుడు మరువొద్దు. జల్ది కానియ్యిండ్రి!

Pittala Srisailam, Journalist

పిట్టల శ్రీశైలం, జర్నలిస్ట్

మూసీ టివి- మూసీ ఫైబర్ టబ్స్  సెల్: 99599 96597

Leave A Reply

Your email address will not be published.

Breaking