People are so ungrateful మనుషులు ఇలా కృతజ్ఞతా హీనత
People are so ungrateful
మనుషులు ఇలా కృతజ్ఞతా హీనత..
కృతజ్ఞతా హీనత..
మొన్న మా ఫ్రెండ్ ఒకమ్మాయి సాయంత్రం పూట ఫోన్ చేసింది. తను గవర్నమెంట్ డాక్టర్. నైట్ డ్యూటీ లో ఉంది. మ్యాటర్ ఏంటి అంటే.. ఎవరో ఒకామె బస్ లో ప్రయాణిస్తుండగా unconscious అయింది. బస్సు డ్రైవర్ ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్ కే బస్సు తీసుకువచ్చేశాడు.
బస్సులో ప్రయాణికులు హాస్పిటల్ స్టాఫ్ అంతా కలిసి ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేయడానికి సహాయం చేశారు. ఆ తర్వాత బస్సు..బస్సులో ప్రయాణికులు అందరూ వెళ్ళిపోయారు.
ఆమె ఎవరో ఎవరికీ తెలియదు
ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె బంధువుల కు సమాచారం ఇవ్వాలంటే ఆమె ఫోన్ లాక్ ఉంది. ఆమె లో చలనం లేదు. ఈసీజీ తీసారు. ఈసీజీ బాగానే ఉంది. ఆ తర్వాత తను ఆ స్త్రీకి స్పృహ తెప్పించేందుకు చాలా కృషి చేసింది.
ఇంకో లేడీ ఫిజీషియన్ సహాయంతో చేయగలిగిందంతా చేశారు. చివరికి ఆమెకు వచ్చిండేది ఒకరకమైన ఫిట్స్ అనీ ఫిట్స్ వచ్చాక ఉండే అతినీరస స్టేజిలో ఆమె ఉందనీ గ్రహించారు.
మందులు మొదలెట్టారు. రాత్రి దాదాపు మూడుగంటల సమయంలో ఆమెలో చలనం వచ్చింది. ఆమె మాట్లాడింది. ఆమె ఫోన్ ద్వారా వాళ్ళ హస్బెండ్ కి సమాచారం అందించారు. ఈమెను స్పృహ తెప్పించేందుకు డాక్టర్లు సిస్టర్లు అంతా రాత్రి మొత్తం ఆమె బెడ్ పక్కనే కూర్చుని మానిటర్ చేస్తూ గడిపారు నిద్రలేకుండా.
పేషెంట్ ను ఇంటి మనిషిలా..
రాత్రి మూడు గంటలకు స్పృహ వచ్చాక విషయాన్ని వాళ్ళ వాళ్ళకు చెప్పాక వెంటనే దగ్గరలోని బంధువులు వచ్చేశారు డాక్టర్ గా మా మిత్రురాలు వారిని కూర్చోబెట్టి ఏం జరిగిందో వివరించింది. ఇటువంటి పేషంట్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కౌన్సెలింగ్ కూడా ఇచ్చింది. ఐతే ఇంకా ఆమె భర్త రాలేదు.
నిద్రహారాలు మాని చికిత్స కానీ..
నిద్రాహారాలు మాని ఈ ఒక్క పేషంట్ కోసం ఎంతో కష్టపడ్డారు. నాలుగ్గంటలకు ఆమెకు కాస్త ధైర్యం చెప్పి ఛాయి బిస్కెట్ తినిపించి ఆమెకు స్పృహ వచ్చిందన్న సంతోషం తమ కష్టం ఫలించిందన్న ఆనందాన్ని స్టాఫ్ అంతా షేర్ చేసుకున్నారు. పొద్దున్న కావొస్తుంది మళ్ళీ పేషంట్లు వస్తారని, అలా కొద్దిసేపైనా నడుము వాలుద్దామని డాక్టర్ తన రూంలోకి వెళ్ళింది. ఒక అరగంట నడుంవాల్చి తను తిరిగొచ్చే సరికి బెడ్ మీద పేషంట్ మాయం.
ప్రాణాలు కాపాడిన వారికి..
ఏంటి అని అడిగితే..ఆమె హస్బెండ్ వచ్చాడంట. ఆమెను వెనునెంటనె డిశ్చార్జ్ చేయాలన్నాడంట. డాక్టర్ తో చెబుతాము కూర్చోండి అని చెప్పినా అవసరం లేదు..మేము వెళ్ళిపోతాం అని బలవంతంగా అన్నీ పీకేసి ఆమెను తీసికెళ్ళాడంట. ఏం చెప్పిన వినే స్టేజ్ లో లేడు.
కనీసం ఆమె కండీషన్ ఏంటో అడగలేదు. ఏం మందులు వాడాలో అడగలేదు. Unconscious లో ఉన్న ఆమె మళ్ళీ కోలుకోవడానికి బస్ డ్రైవర్, తోటి ప్రయాణికుల నుండి హాస్పిటల్ లో ఆయమ్మ వరకు ఎంతగా శ్రమించి పని చేశారో ఎలా మానవీయంగా స్పందించారో ఆయనకు తెలియదు. కనీసం రాత్రంతా కష్టపడిన డాక్టర్ కీ హాస్పిటల్ స్టాఫ్ కి కృతజ్ఞత చెప్పాలని కూడా ఆయనకు అనిపించలేదు.
వాళ్ళిద్దరూ చదువుకున్న ఉద్యోగులే..
గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎందుకంత చులకన?. ఫ్రీగా అంతా దొరుకుతుంది కాబట్టే కదా ఈ carelessness!!. పేషంట్ ఎవరో కూడా తెలియకున్నా ఎలాంటి సమాచారం లేకున్నా డయాగ్నాసిస్ చేసి సకాలంలో ఆమెకు చికిత్స అందించకుంటే మళ్ళీ ఫిట్స్ వచ్చిండింటే ఆమె పరిస్థితి మరింత సీరియస్ గా అయ్యేది. కానీ ఆమె ప్రాణాలను కాపాడిన ఇంత మందిమీద కనీస కృతజ్ఞత!!?.
సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరూ చదువుకున్న వారే…పైగా గవర్నమెంట్ ఉద్యోగులే అని తర్వాత తెలిసింది. వావ్….!! వింత కదూ!!. అవసరం తీరాక విజ్ఞత ఎలా కోల్పోతుంటారో అని మా మిత్రురాలు బాధపడింది. People are so ungrateful
గవర్నమెంట్ డాక్టర్లు కూడా కష్టపడతారు
Important note: ఈ పోస్ట్ పెట్టింది ఆ వ్యక్తులను కామెంట్స్ రూపంలో అందరమూ తిడుతుంటే వచ్చే సోషల్ అండ్ సైకలాజికల్ బెనెఫిట్ షో కోసం కాదు. గవర్నమెంట్ డాక్టర్లు కూడా చాలా కష్టపడతారు. కష్టపడటం లేదా లైట్ తీసుకోవడం వంటివి గవర్నమెంట్ ప్రైవేటు కి సంబంధం లేదు. అది వ్యక్తుల వ్యక్తిత్వానికి సంబంధించినది. అలాగే కృతజ్ఞత కూడా. దాని గురించి మాట్లాడుకోవడానకి మాత్రమే. People are so ungrateful