Header Top logo

Own home Gangavva స్వంత ఇంటిదైన గంగవ్వ

Own home Gangavva

స్వంత ఇంటిదైన గంగవ్వ

అగో గీ ముచ్చట విన్నారుళ్లా.. ఇప్పుడు గంగవ్వ స్వంత ఇంటి మనిషైంది. గంగవ్వ పల్లెటూరి బాషలో మాట్లాడుతూ షార్ట్ ఫిలీంలు తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆరవై ఏండ్లకు గీ గంగవ్వ కొత్త ఇల్లు కట్టుకుని ఇంటి మనిషి అయ్యింది. అగో గిన్ని రోజులు ఇల్లు లేకుండానే ఉందా..? అనే డౌట్ రావచ్చు. గా ముచ్చట వినాలంటే ఆమె లైఫ్ లోకి తొంగి చూడాలే. గంగవ్వది నిరుపేద కుటుంబం. కష్టపడి కుటుంబాన్ని నడుపుకుంటూ వస్తున్న గంగవ్వ బిగ్ బాస్ లో తెలంగాణ బాషలో మాట్లాడి హల్ చల్ చేసింది. ముఖ్యంగా సినీ హీరో అక్కినేని నాగర్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని బిగ్ బాస్ వేధికపై ప్రకటించాడు. అగో ఆ హీరో మాటిచ్చినట్లు గంగవ్వకు ఇల్లు కట్టించిండు. ఆల్ ది బెస్ట్ గంగవ్వ.

– ఈదుల్ల మల్లయ్య

Leave A Reply

Your email address will not be published.

Breaking