Header Top logo

October 8 is Indian Air Force Day అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం

October 8 is Indian Air Force Day  అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం

భారత వైమానిక దళ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న నిర్వహించ బడుతుంది. భారతీయ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) 1932, అక్టోబరు 8వ తేదీన స్థాపించబడి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళంగా పేరు పొందింది. అంతటి శక్తివంతమైన వైమానిక దళం యొక్క సేవలను గుర్తిస్తూ ప్రతిఏటా అక్టోబర్‌ 8న భారత వైమానిక దళ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 1932, అక్టోబర్‌ 8న ఏర్పడిన భారత వైమానిక దళం బ్రిటీష్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. దానికి గుర్తుగా 1945లో రాయల్‌ భారత వైమానిక దళంగా మార్చబడింది.1950లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత భారత వైమానిక దళంగా రూపాంతరం చెందింది. 1933 ఏప్రిల్ 1న భారత వైమానిక దళానికి తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ వచ్చింది. తొలినాళ్ళలో కేవలం ఐదు మంది పైలట్స్, ఒక ఆర్‌ఏఎఫ్‌ మాత్రమే ఉండేవారు. మొత్తం ఐదు ఆపరేషనల్ కమాండింగ్ కేంద్రాలను కలిగిన ఐఎఎఫ్‌కు 1,130 కంబోట్ 1,700 నాన్ కంబోట్ ఎయిర్‌కాఫ్ట్‌లు ఉన్నాయి.

ప్రపంచం లోనే నాలుగో అతిపెద్ద వాయు సేనగా భారత వైమానిక దళం పేరు గడించింది. తనకు అవసరమైన సిబ్బందికి అధునాతన శిక్షణ ఇచ్చుకోవడం లోను, అధునాతన యంత్ర సామాగ్రిని సమకూర్చు కోవడం లోను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ముందంజలో ఉండటమే కాకుండా.. ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ఇండియన్ ఎయిర్‌ ఫోర్సుకు తొలి ఐదుగురు పైలట్స్‌గా విధులు నిర్వహించిన ఘనత హరీష్ చంద్ర సిర్కార్, సుబ్రొతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్, అజాద్ భక్షా అవాన్, అమర్జీత్ సింగ్‌లు వైమానిక చరిత్ర పుటల్లో నిలిచి పోయారు. ఆ తర్వాత సుబ్రతో ముఖర్జీ తొలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి ముందు.. అంచలం చెలుగా మరింత మంది సిబ్బందిని ఐఎఎఫ్ నియమించు కుంది. వారిలో  ఇంజనీర్, కే.కే.ముజుందర్, నరేంద్ర, దల్జీత్ సింగ్, హెన్రీ రంగనాథన్, ఆర్‌.హెచ్‌.డి సింగ్, బాబా మెహర్ సింగ్, ఎస్.ఎన్.గోయల్, ప్రిత్‌పాల్ సింగ్, అర్జన్ సింగ్‌లు అగ్రగణ్యులు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత వాయుసేన క్రీయాశీలక పాత్రను పోషించింది. తొలి వైమానిక దళ దాడి అర్కన్ ప్రాంతంలోని జపనీస్ సైనిక స్థావరంపై జరిపింది.

ఈ యుద్ధం తర్వాత ఐఎఎఫ్‌ను  అంచలం చెలుగా వృద్ధి చెందింది.

యూఎస్‌కు చెందిన వుల్టీ వెంగీయన్స్, బ్రిటీష్air force హాకర్ హరీకేన్, వెస్ట్‌లాండ్ లైసండర్‌ వంటి అధునాతన ఎయిర్ క్రాఫ్ట్‌లు ఐఎఎఫ్‌లో వచ్చి చేరాయి. అంతేకాకుండా.. భారతావనిపై  పొరుగు దేశాలు దాడికి తెగబడినపుడల్లా భారత వాయుసేన కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా.. 1960లో ఏర్పడిన కాంగో సంక్షోభ సమయంలోను, 1962లో జరిగి ఇండో-చైనా పోరు సమయం లోను, కాశ్మీర్‌ కోసం 1965లో పాకిస్తాన్‌తో జరిగి యుద్ధ సమయంలోను, 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటం లోను, 1984లో జరిగి ఆపరేషన్ మేఘదూత్‌ లోను, 1988లో ఆపరేషన్ కాక్టస్‌ లోను, 1999లో జరిగిన ఆపరేషన్ సఫేద్ సాగర్‌ (కార్గిల్ వార్) సమయాల్లో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ సేవలు ప్రశంసనీయం. భారత వైమానిక దళంలో ప్రస్తుతం ఉన్న ఎయిర్‌ క్రాఫ్ట్‌లలో మిగ్-21, హాల్-హెచ్‌జెటి – 36, హెచ్‌జెటి-16 కిరణ్, హెచ్‌పిటి-32 దీపక్, ఇయూషిన్ II-78 ఎంకెఎల్, ఇయూషిన్ II-76, అంటోనోవ్ ఎఎన్-32, అవ్రో-748, డిఓ-228, ఇఆర్‌జె-135, బోయింగ్ -737, ఎంఐ-8, ఎంఐ-17, ఎంఐ-35, ఎంఐ-26, హెచ్‌ఎఎల్ చేతక్, హెచ్‌ఎఎల్ చీటా, హెచ్‌ఎఎల్ ధృవ్, సుకోయ్-30, మిరజ్-2000, మిగ్-29, జగర్, మిగ్-27, మిగ్-23  తేజాస్, హెచ్ఎఎల్ లైట్ కంబొట్ హెలికాప్టర్, బహళ రవాణా, ఐఎల్-76 రకం ఎయిర్‌ క్రాఫ్ట్‌లతో పాటు. స్వదేశ ఎయిర్‌క్రాఫ్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ హాక్ ఎంకే-132 రకం వంటి పలు రకాలు వాయుసేన అమ్ముల పొదిలో ఉన్నాయి.

1.70 లక్షల మంది సిబ్బందితో, 1300 విమానాలతో భారత వైమానిక దళం ప్రపంచం లోనే నాలుగవ పెద్ద వైమానిక దళంగా ప్రసిద్ధి పొందింది. భారత వైమానిక దళంలో ఐదు ఆపరేషన్ కమాండ్‌లు, రెండు ఫంక్షనల్ కమాండ్‌లు ఉన్నాయి.ఆపరేషన్ కమాండ్‌లు: 1.సెంట్రల్ ఎయిర్ కమాండ్, అలహా బాద్; 2.ఈస్టర్‌‌ న్ ఎయిర్ కమాండ్, షిల్లాంగ్; 3.సదరన్ ఎయిర్ కమాండ్, తిరువనంత పురం; 4.సౌత్ వెస్టర్‌‌న ఎయిర్ కమాండ్, గాంధీనగర్; 5.వెస్టర్‌‌న ఎయిర్ కమాండ్, న్యూఢిల్లీ; డిఫెన్స్ రీసెర్‌‌చ అండ్ డెవలప్‌ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ క్షిపణులను తయారు చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. మన దగ్గర ఉన్న క్షిపణుల్లో బ్రహ్మోస్.. సూపర్‌ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఇది ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి.

భారతదేశం లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నది పేర్ల మీద ఈ క్షిపణికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. దీని పరిధి 290 కిలోమీటర్లు. ఇది 2.5 నుంచి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది.నిర్భయ్ అనే సబ్‌సోనిక్ క్షిపణి.. ధ్వని వేగం (1 మ్యాక్) కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని పరిధి 1,000 కి.మీ. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పాకి స్తాన్‌తో 1947, 1965, 1971, 1999లలో నాలుగుసార్లు యుద్ధాలు చేసింది. 1971లో పాకిస్తాన్‌ను ఓడించి, బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. 1962లో చైనాతో యుద్ధం చేసింది. భారత రక్షణ వ్యవస్థలో త్రివిధ దళాలు ఉన్నాయి. అవి.. సైనిక దళం, వైమానిక దళం, నావికా దళం. భారత రక్షణ దళాల అధిపతి (సుప్రీం కమాండర్) రాష్ర్టపతి. రక్షణ దళాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆధీనంలో ఉంటాయి. ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలు న్యూఢిల్లీలో ఉన్నాయి.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల, రచయిత  సెల్:   9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking