Header Top logo

MLA Kidapped By Naxals -05 నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే

కిడ్నాప్

MLA Kidapped By Naxals -05

నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే-05

మనిషి వలస జీవి..

బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతాడు.
అలాగే నా పూర్వీకులు 1940లో గుంటూరు జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు వలస వచ్చారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ సాగునీటితో వ్యవసాయం సాగు చేయోచ్చాని వ్యవసాయ భూములు కొన్నారు వారు.
ఆ తరువాత ఏడేళ్లకు భారత దేశానికి 1947లో స్వాతంత్య్రం సిద్దించింది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దర్మారం గ్రామంలో 1954 లో నేను జన్మించాను.

కమ్యూనిష్టు కుటుంబం..

మా నాన వెంకట్రామయ్య కమ్యూనిష్టు సానుభూతి పరుడు..
అందరు సమానత్వంతో జీవించాలని.. దోపీడి లేని వ్యవస్థ ఏర్పడాలని కోరుకుంటారు ఆయన..
విప్లవ సాహిత్యం చదువక పోయినా.. కమ్యూనిష్టు యోధులతో ఉన్న సంబంధాలు అతనిని ప్రభావితం చేసాయి.
నేను మాత్రం ఏ రోజు రాజకీయాలోకి వస్తానని అనుకోలేదు. విద్యార్థి దశలో కూడా నేను ఉద్యమాలలో పాల్గొన్న సందర్భం లేదు.

నాటకాలంటే ఇష్టం

నాకు చిన్ననాటి నుంచే సాంస్కృతిక కార్యకలపాలంటే ఇష్టం..
నాటకలో ఏకాపాత్రభినయ పాత్రలో అందరిని మెప్పించాను.
కబడ్డి.. బ్యాట్ మ్యాంటన్ క్రీఢలో నేషనల్ లెవల్లో జరిగిన టోర్నమెంట్ పోటీలో ప్రతిభ చూపాను.
చదువు పూర్తి కాగానే బిజినెస్ చేయాలనుకున్నాను.
గ్రామ రాజకీయాల్లోకి రావాలని గ్రామస్థులు కోరినా.. వాటికి దూరంగా జీవించాలనుకున్నాను.
దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సి విధించిన కాలంలో మాత్రం విద్యార్థిగా జనతా పార్టీకి సపోర్టు చేసాను.
అందుకు కారణం..?

ఎన్టీఆర్ పై నమ్మకంతో..

మొదటి నుంచి నాన వెంకట్రామయ్య కమ్యూనిష్టు సిద్దంతాలతో కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించడం కావచ్చు.. జనతా పార్టీకి మద్దతు ఇచ్చానెమో..
1983లో ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీ స్థాపించినప్పుడు సంతోషపడ్డాను..
అతనిపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరాను.
కానీ.. ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలువాలని ఎప్పుడు అనుకోలేను..
అమ్మ`నాన ప్రభావం నాపై ఉంది.. అలాగే అక్కా`బావ ఆలోచన విధానం నాకు నచ్చింది.
క్రమశిక్షణ, నైతిక విలువలను వారి నుంచి నేర్చుకున్నాను. MLA Kidapped By Naxals -05

జీవితం చాలా విచిత్రం..

ఎప్పుడు ఎవరి జీవితం ఎటు మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిసిన థామస్ చౌదరి ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచిన నాదేండ్ల భాష్కర్రావు వర్గంలో చేరాడు.
అక్కడే నా పొలిటికల్ లైఫ్ లో టర్నింగ్ ఫాయింట్..
ఆ తరువాత 1985లో జరిగిన ఎన్నికలో పోటీ చేయడానికి నలుగురు దరఖాస్తు చేసుకుంటే ఎన్టీఆర్ నాకే టిక్కెట్ ఇచ్చారు.
‘‘కమ్యూనిష్టు పార్టీలు మినహా బూర్జువ పార్టీలు ప్రజలకు సేవ చేయలేవు.. ఈ బూర్జువ రాజకీయాలు వద్దు. డబ్బు సంపాదించాంటే బిజినెస్ చేయు.. లేదా వ్యవసాయం చేయు..’’ అన్నారు తండ్రి వెంకట్రామయ్య..

రాజకీయాలలో డబ్బు

‘‘డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి వెళ్లడం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. రాజకీయాలలో డబ్బు ఆశించాను.’’ అంటూ తండ్రికి నచ్చ చెప్పాను.
ఆ తరువాత ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిసాను.
మొదటి సారిగా అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టిన రోజు అనుభూతిని ఎప్పటికి మరిచి పోలేను.
అప్పటికి నా వయసు ముప్పయి ఒక సంవత్సరమే..
ఆ అసెంబ్లీలో రాజకీయ కురు వృద్దులు కూర్చుండి చర్చించిన వేధికలో నేను కూర్చొవడం మరిచి పోలేని అనుభూతి.. అసెంబ్లీలో కూర్చున్నందుకు బాధ్యతగా ఫీలయ్యాను. బంధు ప్రీతికి అతీతంగా డిచ్పల్లి నియోజక వర్గ అభివృద్దికి కృషి చేయానుకున్నాను. MLA Kidapped By Naxals -05

అవినీతికి కెరాఫ్ అడ్రసుగా

కానీ.. అవినీతికి కెరాఫ్ అడ్రసుగా నిలుస్తున్నాయి పాలిటిక్స్..
ఫైరవీలతో కోట్లు ఆర్జిస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు.. మంత్రులు..
ఎన్నికలో డబ్బు డామినేట్ చేస్తున్నాయి.. ఓట్లను నోట్లతో ప్రభావితం చేస్తున్నారు పొలిటికల్ లీడరులు..
డబ్బుంటెనే రాజకీయం.. లేకుంటే అది పేదోడికి అందని ద్రాక్షగా మారింది..
జీవితమంటే డబ్బు సంపాదించడమేనా..?

ఇవేనా.. రాజకీయాలంటే..?

రాజకీయాలో అవినీతి.. అక్రమాలు.. ఇవేనా.. రాజకీయాలంటే..?
అక్రమంగా డబ్బు సంపాదించడమెనా..?
ఉద్యోగుల బదిలీలు.. పోలీసు స్టేషన్ లలో ఫైరవీలేనా..? కంట్రాక్ట్ పనులేనా..? వీటికి నేను దూరంగా ఉండానకున్నాను.
నా జీవితంలో జూన్ 1987 మరిచి పోలేని రోజు….

(ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాక మరణం తప్పదని తెలిసి ఎమ్మెల్యే ఏమి చేసాడు..? రేపటి వరకు ఎదురు చూడాల్సిందే..)

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking