Memories of ‘Ma Bhoomi’ movie ‘మా భూమి’ సినిమా జ్ఞాపకాలు..
Memories of ‘Ma Bhoomi’ movie
‘మా భూమి’ సినిమా జ్ఞాపకాలు..
‘మా భూమి’ సినిమా.. ఇది నలుపై ఏళ్ల క్రితం వచ్చిన తెలుగు మూవీ. మూస చిత్రాలకు భిన్నంగా వచ్చిన తొలి తెలంగాణ చిత్రం. గ్రామీణ ప్రాంతాలలో భూస్వాముల ఆరాచకాలను, ఆఘయిత్యాలను కళ్లకు కట్టిన చిత్రం ‘మా భూమి’ బి.నరసింగరావు సినిమాకు భారీ ఓపెనింగ్స్. టిక్కెట్ల కోసం కొట్టుకోవడం. టిక్కెట్లు దొరక్క వెనక్కు వెళ్లాల్సి రావడం. ఇవన్నీ అతిశయోక్తులు అనుకుంటారు. కానీ వాస్తవాలు. ఆయన సినీ జీవితంలో ఈ విచిత్రం ఒకే సారి జరిగింది. గౌతమ్ ఘోష్ డైరక్ట్ చేసిన మా భూమి సినిమా నిర్మాతల్లో నరసింగరావు ఒకరు. రెండో నిర్మాత రవీంద్రనాథ్.తను ఎవరో కాదు సారధీ స్టూడియోస్ లోనూ నవయుగ డిస్ట్రిబ్యూషన్ లోనూ భాగస్వామి అయిన గుళ్లపల్లి దుర్గా ప్రసాదరావు కొడుకే. అయినా సరే ఆ సినిమాను నవయుగలో రిలీజు చేయలేదు. లక్ష్మీ ఫిలింస్ లో విడుదలైంది. అంటే సినిమా పోతుందనే నమ్మకం ఉండడం వల్లే నవయుగ వారు దాని జోలికి రాలేదు. అయితే అంతకు ముందు మృణాళ్ సేన్ దర్శకత్వంలో రవీంద్రనాధ్ తీసిన ఒక ఊరి కథ మాత్రం నవయుగవారే రిలీజ్ చేశారు. అది ఫ్లాప్ అయ్యింది. అందుకే వారు మాభూమి వద్దన్నారు. Memories of ‘Ma Bhoomi’ movie
‘మాభూమి’ సినిమాను రిలీజ్ చేసిన లక్ష్మీ ఫిలింస్
సిన్మా సూపర్ హిట్ అయ్యింది. దాని తర్వాత ఆ బ్యానర్ లో వచ్చింది ‘రంగులకల’ సినిమా. ‘మాభూమి’ టీమ్ నుంచి వచ్చిన చిత్రం అనే ఇమేజ్ కు తోడు పుంజుకున్న పీపుల్స్ వార్ ఉద్యమం కూడా కారణం కావచ్చు. దాంతో పాటు పెరిగిన గద్దర్ పాపులార్టీ. ఇవన్నీ కూడా ‘రంగులకల’ కు కొత్త క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. దీంతో ‘రంగులకల’ సినిమా కోసం జనం వెయిట్ చేయడం జరిగింది. ‘మా భూమి’ హిట్టై ఉండడంతో ఈ సారి నవయుగా వారు ‘రంగులకల’ ను తీసుకున్నారు.
ఎన్టీఆర్, కృష్ణల సినిమాల విడుదలలా..
విజయవాడ అలంకార్ థియేటర్ లో రిలీజు చేశారు. రిలీజు రోజున రంగులకల టైటిల్ తో ఓ టాబ్లాయిడ్ పత్రిక కూడా రిలీజు చేశారు. బుకింగుల దగ్గర టిక్కెట్ల కోసం కొట్టుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణల సినిమాల విడుదల సందర్బంగా థియేటర్ల దగ్గర పనిపించే రష్ రంగులకల విడుదలైన రోజు విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర కనిపించింది. మార్నింగ్ షో ప్రారంభమైంది. ముగిసింది. మ్యాట్నీకి కూడా బాగానే జనం ఉన్నారు. ఫస్ట్ షో నుంచి జనం పల్చబడ్డారు. మర్నాటి నుంచి ఆ థియేటర్ వైపు జనం రావడం బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత నరసింగరావు తీసిన సినిమాలేవీ అలా విడుదలా కాలేదు. అలా ఓపెనింస్ రాబట్టలేదు. అలా అదో ముచ్చట. Memories of ‘Ma Bhoomi’ movie