Mahaprasthana of Bapu dolls-13 బాపు బొమ్మల మహాప్రస్థానం-13
Mahaprasthana of Bapu dolls-13
బాపు బొమ్మల మహాప్రస్థానం-13
చేదుపాట…!!
శ్రీశ్రీ కవిత్వం, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటారు
సౌరిస్. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడూ
లక్షణాలనూ, రాగాలనూ మీరి👂 చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఇప్పుడు శ్రీ శ్రీ గారి ” చేదు పాట” ను వినండి.!!
“ఔను నిజం, ఔను నిజం,
ఔను నిజం, నీవన్నది
నీవన్నది నీవన్నది
నీ వన్నది నిజం, నిజం.!
లేదు సుఖం, లేదు సుఖం,
లేదు సుఖం జగత్తులో !
బ్రతుకు వృధా,చదువు వృధా,
కవిత వృధా,వృధా,వృధా,!
మనమంతా బానిసలం,
గానుగలం, పీనుగులం!
వెనుక దగా ! ముందు దగా!
కుడి ఎడమల దగా ! దగా !
మనదీ ఒక బ్రదుకేనా?
🐶 🐶 కుక్కల వలె, నక్కలవలె
మనదీ ఒక బ్రదుకేనా?
సందులలో పందుల వలె !
నిజం సుమీ,నిజం సుమీ,
నీవన్నది నిజం సుమీ!
బ్రతుకు ఛాయ,చదువు మాయ,
కవిత కరక్కాయ సుమీ..”!!
లేదు సుఖం, లేదు రసం,
చేదు విషం ,జీవ ఫలం
జీవఫలం చేదు విషం,
చేదు విషం,చేదు విషం
ఔను నిజం , ఔను సుమా ,
ఔను నిజం నీవన్నది
నీవన్నది నీవన్నది
నీవన్నది నిజం నిజం..”!!
శ్రీశ్రీ…14.5.1937. ఓ రకంగా హేళన కవిత ఇది.ఇందులో శ్రీ శ్రీ వేదాంతుల్ని, మాయా వాదుల్ని తూర్పారబట్టాడు. ఓ రకంగా వారిని వెక్కిరించాడు.జగత్తు లో సుఖం లేదు. మనమంతా బానిసలమై పోయాం. మన ముందు దగా ! వెనుక దగా! మనమంతా 🐕🐶 కుక్కల్లా..! నక్కల్లా🦊, పందుల్లా బతుకుతున్నామని వాపోయాడు. అయినా వేదాంతులన్నట్లే బతుకు ఛాయ, చదువు మాయ, కవిత కరక్కాయ సుమా..! అన్నాడు. జీవఫలం చేదు విషమని బాధపడ్డాడు. చలం గారిని నొప్పించిన గేయం ఇది. Mahaprasthana of Bapu dolls-13
*బాపు బొమ్మకు…’బ్నిం’ వివరణ…!!
ఎంత చదివినా, సొంతంగా చదువులు రాసిన కవులైనా, మనందరి చదువులు వృధా! బతుకు ఛాయ.. చదువు మాయ
కవిత కరక్కాయ (చేదు).
మనం ఏం సాధించినా…అందరం బందీలమే.మన జీవఫలాన్ని ఎవడో కొట్టుకు పోతుంటే మననే పట్టుకు పోతుంటే.. మనం బతుకునే కట్టుకొని పోతుంటే..? బాపుగారి బొమ్మల మాదిరిగా ఓ బచ్చాపెట్టుబడిదారుడు పెద్ద, బలమైన, ఘనమైన పాదాలని కట్టేసి లాక్కొని వెళ్తున్నట్లు చూపించడం చూస్తుంటే ఏనుగుని ఎలుక తనతోకతో కట్టేసి లాక్కొని పోతున్నట్టు అనిపిస్తుంది.(‘బ్నిం’) Mahaprasthana of Bapu dolls-13