హైదరాబాద్ లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న రాహుల్ గాంధీ తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా ఢిల్లీకి ప్రయాణమయ్యారు. శనివారం సాయంత్రం గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుండి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడి నుండి విమానంలో ఢిల్లీకి ప్రయాణమయ్యారు.రాహుల్ గాంధీకి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ కు ఘన వీడ్కోలు పలకడానికి టి పి సి సి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు.
అనంతరం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే టిఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్ల రూపాయల వెనక వేసుకొని సిగ్గులేకుండా వేల కోట్లు మవద్ద ఉన్నాయని మాట్లాడుతున్నారని ఆరోపించారు. మిగులు నిధుల ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లిన టిఆర్ఎస్ ప్రభుత్వం తమ సొంత ఆస్తులను పెంచుకొని రాక్షసానందం పొందుతున్నారని తెలంగాణ రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం నిలువునా ముంచిందని తెలంగాణ కుటుంబ ద్రోహులకు ప్రజలు రాబోవు దినాల్లో సరైన బుద్ధి చెబుతారని తెలిపారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసియు సెంటర్ లో రోగులను ఎలకల కరుస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంటినొప్పి నెపంతో పలు ఢిల్లీ పర్యటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన జోష్ తో కాంగ్రెస్ పార్టీ నేతలు వాడవాడలా బస్తి బస్తీలోనా పర్యటించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కష్టపడి కృషి చేయాలని తెలిపారు.