Let’s think Mudiraj brothers -04 ముదిరాజ్ ల్లారా ఆలోచన చేద్దాం
ముదిరాజ్ బంధువుల్లారా
ఆలోచన చేద్దాం..
Let’s think Mudiraj brothers -04
యాటకర్ల మల్లేష్ ముదిరాజ్, జర్నలిస్ట్
————————–
హైదరాబాద్ సెంట్రల్ కోర్టు హోటల్ ఎసి గదిలో చల్లని వాతవరణంలో వేడి వేడిగా కొనసాగుతున్నాయి చర్చలు. ముదిరాజ్ జాతి అభివృద్ది కేంద్రంగా రూపొందించే ప్రణాళిక గురించి ఓపెన్ గా చర్చిస్తున్నారు అందరు.
‘‘ఒక మానవుడిని మరో మానవుడు దోపీడి చేయని వ్యవస్థ కోసం పోరాటం చేయడంలో భాగంగా నక్సలైట్లు పేదల కోసం ప్రాణ త్యాగాలకు వెనుకాడరని విన్నాను. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నక్సలైట్లకు కేంద్రంగా నిలిసిందని చెబుతారు. నక్సలైట్ల గురించి నేను విన్నది తప్పెనా..?’’ ప్రశ్నించాడు ఓ యూ స్కాలర్ ఉదయ్ కిరణ్.
‘‘చేతిలో సెల్ ఫోన్ ఉంటే వాట్సాప్ లో చాటింగ్, ఫేస్ బుక్ లేదా ఇన్ స్టాగ్రాంలో పోస్టింగ్ లు. ఇవే గదా మీలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు చేస్తున్న పని. సోషల్ మీడియాతో బిజి బిజీగా గడుపుతున్న మీకు చరిత్రను తెలుసుకునే ఆలోచన లేకుండా పోయింది.
నక్సలైట్.. ఈ పేరు వింటే ఒకప్పుడు దొరలు, భూస్వాములు హడాలి పోయేవారు. మా కోసం నక్సలైట్లు ప్రాణాలు ఇస్తారని పేదలు భావించే వారు.’’ వివరించారు జర్నలిస్ట్ రమేష్.
‘‘అట్లాయితే.. బండ ప్రకాష్ గారు, ఈటెల రాజేంధర్ గారు విద్యార్థి దశలో నక్సలైట్ గ్రూప్ లలో పని చేసామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి గదా..? మరిప్పుడు వారేందుకు మారి పోయినట్లు..?’’ ప్రశ్నించాడు రిటైర్డు లెక్చరర్ ప్రకాష్.
‘‘మీకు తెలుసా..? మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పళ్ల లక్ష్మన్ రావుతో సమకాలికుడిగా పని చేసిన బండ ప్రకాష్ గారు నక్సలైట్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య గారికి గన్ మెన్ గా పని చేసినట్లు పత్రికలలో వార్త కథనాలు కూడా వచ్చాయి.
కానీ.. బండ ప్రకాష్ గారు ఇప్పుడు ముదిరాజ్ జాతి ప్రయోనాల కంటే కూడా వ్యక్తిగత లాభం ముఖ్యం అనుకుంటున్నారని యావత్తు ముదిరాజ్ జాతి భావిస్తోంది.’’ వివరించారు పొలిటికల్ లీడర్ ఆధిత్య.
‘‘బండ ప్రకాష్ గారు రాజ్యసభ సభ్యుడిగా ఆ తరువాత ఎమ్మెల్సీగా మత్స్య కార్మికుల కోసం నిరాంతరం పని చేస్తున్నట్లు మన ముదిరాజ్ సోషల్ మీడియాలో ప్రతి రోజు ఫోటోలతో పోస్ట్ లు వస్తున్నాయి గదా.. ఆ పెద్దాయనను మరీ అంత తీసి పారెయ్యడం సరి కాదు.’’ అన్నాడు ఓయూ స్కాలర్ ఉదయ్ కిరణ్.
‘‘రాజ్యసభ సభ్యులుగా ఉన్న బండ ప్రకాష్ గారికి ఎమ్మెల్సీగా నియామిస్తామని టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చెప్పినప్పుడు ఆ పదవి మరో ముదిరాజ్ బిడ్డకు ఇవ్వాలని సూచన చేస్తే బాగుంటుండే.
ఈటెల రాజేంధర్ ప్లేస్ లో తాను మంత్రిని అవుతాననే స్వార్థంతో ఆలోచన చేసిన బండ ప్రకాష్ గారు ఆ పని చేయలేక పోయారు. అతని అత్యాశ వల్లే ఈ రోజు ఎమ్మెల్సీ పదవి మరో ముదిరాజ్ బిడ్డకు దక్కలేదు.’’ వివరించారు పొలిటికల్ లీడర్ ఆధిత్య.
‘‘బండ ప్రకాష్ గారికి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి పిట్టల రవీంధర్ గారికి కన్ ఫాం అయినట్లు చెబుతారు. బండ ప్రకాష్ గారికి ఇవ్వడం వల్లే రవీంధర్ గారికి క్యాంసల్ అయ్యిందట నిజమెనా..??’’ అడిగాడు రిటైర్డ్ లెక్చరర్ ప్రకాష్.
‘‘నిజమే.. ఈటెల రాజేంధర్ గారు టీఆర్ ఎస్ పార్టీకి దూరమైనప్పుడు మొదట పిట్టల రవీంధర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టాన వర్గం ఆలోచన చేసిందట. ఎమ్మెల్సీ కొరకు పార్టీ పరిశీలనలో ఉన్న పేరులలో పిట్టల రవీంధర్ పేరు కూడా టీవీ న్యూస్ ఛానల్స్ లలో భ్రేకింగ్ వార్తలలో వచ్చింది.
కానీ.. బండ ప్రకాష్ గారి అత్యాశ వల్ల పిట్టల రవీంధర్ గారికి గాని మరో ముదిరాజ్ బిడ్డకు దక్కాల్సిన పదవి దక్కలేదు.’’ వివరించారు పొలిటికల్ లీడర్ ఆధిత్య.
‘‘ఈటెల రాజేంధర్ గారు బీజేపీలో చేరిన నుంచి తనకు జరిగిన అవమానం, ఆత్మగౌరవం గురించి భవిష్యత్ లో అధిరోహించే పదవుల గురించి మాట్లాడుతున్నాడు తప్ప ముదిరాజ్ జాతి అభివృద్ది కోసం ప్రణాళిక గురించి ఒక్క మాట కూడా మాట్లాడం లేదెందుకు..?’’ ప్రశ్నించాడు రిటైర్డ్ లెక్చరర్ ప్రకాష్.
‘‘ఔను.. మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఈటెల రాజేంధర్ గారు తనకు జరిగిన అవమానం గురించి, ఆత్మగౌరవం గురించి, భవిష్యత్ లో తాను పొందగోరే పదవుల గురించి మాత్రమే మాట్లాడారు.
ముదిరాజ్ జాతి మొత్తం తన వెనుక ఉండాలని కోరుతున్న ఈటెల గారు వెనుక బడిన ముదిరాజ్ జాతి ప్రయోజనాల కోసం తన ప్రయత్నం తన ప్రణాళిక గురించి ఒక్క మాట కూడా చెప్పక పోవడం శోషనియం. ముదిరాజ్ చిరకాల డిమాండ్ల సాధన గురించి ప్రస్థావించలేదు.’’ వివరించారు పొలిటికల్ లీడర్ ఆధిత్య.
‘‘అంతేగాదు.. ఈటెల రాజేంధర్ గారిని మంత్రి పదవి నుండి తొలగించిన రోజు నుండి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందే వరకు ముదిరాజ్ బిడ్డలు, యువకులు, విద్యార్థులు రాజకీయాలను పక్కన పెట్టి అతని వెంట నడిచారు. మొదటి నెల రోజులు ముదిరాజ్ యువకులు తమ కుటుంభీకులను వదిలి ఈటెల రాజేంధర్ ఇంటి దగ్గరే వారికి కొండంత ధైర్యంగా నిల బడ్డారు.
ఈ సత్యాన్ని మరిచిన ఈటెల గారు ‘మొట్ట మొదటి పోన్ రాజగోపాల్ రెడ్డి గారే చేశారు’ అని ముదిరాజ్ ఆత్మీయ సమ్మెళనంలో ప్రకటించడం ముదిరాజ్ జాతిపై ఈటెల చిన్న చూపుకు నిధర్శనంగా చెప్పొచ్చు. రెడ్డి బంధువులపై ఉన్న ప్రేమకు అతని మాటలే నిధర్శనం’’ అన్నారు జర్నలిస్ట్ రమేష్.
‘‘ఈటెల రాజేంధర్ గారిని నమ్ముకుని బీజేపీలో చేరుతున్న ముదిరాజ్ బిడ్డల భవిష్యత్ ఎలా ఉంటుండంచు.’’ ప్రశ్నించారు రిటైర్డు లెక్చరర్ ప్రకాష్.
‘‘షాద్ నగర్ ముదిరాజ్ నాయకుడు అందే బాభన్న ముదిరాజ్ తన ఎమ్మెల్సీ పదవిని అవకాశాన్ని కాదని, టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని వదులు కొని ఈటెల గారి వెంట నడిచారు. ఇప్పుడు అతనికి షాద్ నగర్ బీజేపీ టిక్కెట్ వస్దుందనే నమ్మకం లేదు. ఈటెల రాజేంధర్ గారి వెంట నడుస్తున్న దేవు సాంబయ్య ముదిరాజ్ గారికి కూడా బీజేపీ టిక్కెట్ వస్దుందనే గ్యారంటీ లేదు.
ఇంకా ఎంతో మంది ముదిరాజ్ నాయకులు ఎమ్మెల్యే టికెట్ లు ఆశించి ఈటెల గారి వెంట తిరుగుతున్నారు. వీరిలో కనీషం ఐదుగురికి ఇప్పుడే బిజేపి పార్టీ టిక్కెట్ హామి ఇస్తే బాగుంటుంది. మిగతా వారికి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన వచ్చినప్పుడు ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఈటెల గారు తీసుకోవాలి. చివరి నిమిషంలో ‘నా చేతిలో ఏమూంది అధిష్టానమే చూసుకుంటుంది.’ అని ఈటెల గారు చేతులెత్తెస్తే మా భవిష్యత్ ఏమిటి అని ఆశావాహుల్లో భయం వ్యక్తం అవుతుంది.’’ అన్నారు పొలిటికల్ లీడర్ ఆధిత్య.
‘‘ఈటెల గారు, బండ గారు నక్సలిజం సంస్థలలో పని చేసినప్పటి బడుగు, బలహీన వర్గాల పక్ష పాత భావ జాలాన్ని మరువలేదు అని నిరూపించుకోవాలంటే వారు తమ వ్యక్తి గత ప్రయోజనాలను పక్కన పెట్టి ముదిరాజ్ జాతి ప్రయోజనాల కోసం పని చేయాలని ముదిరాజ్ లు కోరుకుంటున్నారు.’’ అన్నాడు జర్నలిస్ట్ రమేష్.
(ఐదవ ఎపిషోడ్ లో మళ్లీ కలుద్దాం…)
యాటకర్ల మల్లేష్ ముదిరాజ్, జర్నలిస్ట్
949 222 5111