Header Top logo

కోవిడ్ చికిత్సలపై మొద్దు నిద్ర వీడండి – సీపీఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన

AP 39TV 06 మే 2021:

కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో స్థానిక శాసన సభ్యులు అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడి కోవిద్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.వేమయ్య యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కోవిద్ బాధితుతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలoటూ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో ఐసియు ఏర్పాటు చేసి రోగుల రద్దీకి అనుగుణంగా ఆక్సిజన్ బెడ్ల సంఖ్య యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సెంటర్లో ఆక్సిజన్ సౌకర్యం అందక పదుల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృతిచెందారని, ఆక్సిజన్ సమస్యను పరిష్కరించి కోవిద్ బాధితులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఇటు స్థానిక శాసనసభ్యులు అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారనీ మండిపడ్డారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు సొంత ఆసుపత్రుల్లో పనిచేస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు అధికారులు ప్రజల కోసం పని చేయాలని ప్రభుత్వాలకు ఏజెంట్లా పని చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అనంతరం ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే ని కలవడానికి ప్రయత్నించగా పోలీసులు దురుసుగా ప్రవర్తించి సీపీఐ నాయకులను ప్రజా సంఘాల నాయకులను తోసి వేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కదిరప్ప, మనోహర, నరసింహులు, ఇమ్రాన్, ముబారక్ లక్ష్మీ నాయక్, లియాకత్ ఈశ్వరయ్య, రాజేంద్ర, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking