కుష్టు వ్యాధి అంటువ్యాదే కానీ …సులభముగా సోకదు
కుష్టు వ్యాధి అంటువ్యాధి అయినప్పటికి అంత సులభంగా మరొకరికి శోకదని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సాయి చౌదరి అన్నారు. మార్చి 11 నుండి మార్చి 24 తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, నేడు జన్మభూమి కాలనీ యందు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ కుష్టు వ్యాధిగ్రస్తులతో ఎక్కువ కాలం సహవాసం చేస్తే సోకే అవకాశాలు ఎక్కువ అని, సాధారణంగా నోటి దుంపల ద్వారా ఇది వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన దాదాపు 3 నుంచి 15 సంవత్సరముల అనంతరం దీని దుష్పరిణామాలు బయటపడతాయని, శరీరంపై ఎక్కడైనా తెల్లా లేదా రాగి రంగు మచ్చలు మెరుస్తున్నట్లుగా గమనిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని చికిత్స పొందితే వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చని సాయి చౌదరి తెలిపారు.