Lawyer Beam Rao Red Salute న్యాయవాది బీమ్ రావు విప్లవ జోహార్లు..
Lawyer Beam Rao Red Salute
న్యాయవాది బీమ్ రావు విప్లవ జోహార్లు..
ప్రజల కోసం పోరాటాలు చేసే వీరులు భౌతికంగా లేక పోయిన వారి నిస్వార్థ సేవాలు ప్రజలు హృదయాలలో గూడు కట్టుకుని ఉంటాయి. పేద, బడుగు, బలహీన వర్గాల పక్షణ పోరాటాలు చేసే వారి పక్షణ నిలిసిన సినియర్ న్యాయవాది, హక్కుల నేత పి బీమ్ రావు ఇక లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నారు అభ్యుదయవాదులు.
సీనియర్ న్యాయవాదిగా నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతంలో పేదలకు జరిగే అన్యాయాలపై కోర్టులో నిలదీసి న్యాయం చేసిన భీమ్ రావు గారు 24 జనవరి 2022 నాడు ఉదయం తుది శ్వాష వదిలారు. న్యాయాన్ని డబ్బులకు అమ్ముతూ విలాసవంతమైన జీవితాలు అనుభవించే కొందరు న్యాయవాదులకు భిన్నంగా పేదల అభ్యున్నతే ధ్యేయంగా పని చేశారు భీమ్ రావు గారు.
కోర్టు కేసులకు హాజరయ్యే క్లయింట్లకు డబ్బులు లేకుంటే తన జేబులోని డబ్బులను ఇచ్చిన గొప్ప మానవతవాది భీమ్ రావు గారు. ప్రజా ఉద్యమాలు చేసే ప్రజా సంఘాల నాయకుల, కార్యకర్తల పక్షపాతిగా పని చేయడానికి అతను ప్రజా ఉద్యమాలపై ఉన్న గౌరవమే అంటున్నారు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి ఆర్మూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి వి. ప్రభాకర్.
పోలీసులు ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టిన సందర్భంలోల కోర్టులో నిలదీసిన సంఘలను ఎన్నో. ఆనారోగ్యంతో బాధపడుతున్నారని పరామార్శించడానికి వెళ్లిన తమపై చూపిన ప్రేమ మరువలేనిదంటున్నారు ఆయన. ప్రజా ఉద్యమంలో పని చేసిన భీమ్ రావు గారు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నారు.Lawyer Beam Rao Red Salute
విప్లవ జోహార్లు
ఆర్మూర్ ప్రాంతంలో పేదల న్యాయవాదిగా పేరొందిన భీమ్రావు మరణం ప్రజలకు విషాదాన్ని కలిగిస్తుందన్నారు ప్రజా సంఘాల నాయకులు. హక్కుల సంఘం నాయకుడిగా, మంచితనానికి మారుపేరుగా నిలిచిన భీమ్రావుగారి జీవితం స్పూర్తి దాయకం అన్నారు.
భీమ్రావు కుటుంబానికి
భీమ్రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారిలో ఐఎఫ్టియు నాయకులు దాసు, సూర్య శివాజీ, సుంకరి శ్రీనివాస్, నగేష్ గౌడ్, పీ రాజేశ్వర్, కృష్ణంరాజు, పీ వై ఎల్ నాయకులు దేశెట్టి సాయి రెడ్డి సురేష్ బాబు, ఎస్ రవి, ఎస్ వెంకటేష్, హుస్సేన్, మల్లేష్, ఠాకూర్, ఎం వెంకటేష్, అజీమ్, అరుణోదయ కళాకారులు నాయకులు రంజిత్, అబ్దుల్, రమేష్, డప్పు గంగాధర్ తదితరులున్నారు.
భీమ్ రావు అమర్ హై.. భీమ్ రావుకు విప్లవ జోహార్లు..
- యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్