Kuntala Falls- Bitter Memories-03 కుంటల జలపాతం- చేదు జ్ఞాపకాలు
Kuntala Falls- Bitter Memories-03
కుంటల జలపాతం- చేదు జ్ఞాపకాలు
అప్పటికి సమయం సాయంత్రం 6 కావస్తుంది వార్తకు సంబంధించిన ప్రాథమిక సమాచారం తప్ప ఇంకేమి పంపలేదు అప్పటివరకు… కుంటాల జలపాతం వద్ద నెట్వర్క్ ఉండదు.. అందుకే మా ఫోన్లన్ని మూగబోయాయి.. వార్తను కంపోజ్ చేసెందుకు బయల్దేరుతున్న మాకు గుండం వద్ద గల్లంతైన యువకుల స్నేహితులు కనిపించారు.. ఘటన ఎలా జరిగిందో తెలుసుకుందామని వారి వద్దకు వెల్లి పలకరించాము… వారు మాతో మాట్లాడానికి ఏమాత్రం సుముఖత చూపించడం లేదు…
అందుకు కారణం లేకపోలేదు..? ప్రమాదం జరిగే వరకు తమతో కలిసి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపిన మితృలు ఒక్కసారిగా తమ కళ్ల ముందే నీట మునగడం వారికి ఒక షాక్ అయితే , ఎన్నాళ్ల స్నేహమో శాశ్వతంగా కోల్పోతున్నమేమో అనే బాధ, ఆ ఇద్దరి మరణానికి వారి కుటుంబసభ్యులు తమను ఎక్కడ దోషులుగా చూస్తారేమోననే భయం వారి లో స్పష్టంగా కనిపిస్తుంది..ఎలాగోలా వారిని మాట్లాడించాలనే ప్రయత్నం మాది..కాని ఎంత నచ్చచెప్పిన వారు మాత్రం నోరు విప్పడం లేదు… వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుండి బయల్దేరబోయాము.. అంతలో ఆ యువకులలో ఒకరు అన్న నేను చెబుతాను కాని కెమెరా పెట్టకండి అన్నాడు… సరే పెట్టములే ఏం జరిగిందో చెప్పు చాలు అన్నాము… Kuntala Falls- Bitter Memories-03
అన్నమాది నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ గ్రామం… గల్లంతైన వారు అన్సార్, ఫైజాన్… ఫైజాన్ డిగ్రి చదువుతున్నాడు, అన్సార్ బైక్ మెకానిక్… జలాపాతం దిగువన వచ్చిన తరువాత ఉత్సాహంగా గడిపాము.. పైన ఇంకా బావుంటుందని అనుకొని ప్రవాహం పక్క నుండి పైకి ఎక్కాము.. అక్కడ సెల్ఫీలు దిగే క్రమంలో ఫైజాన్ కాలు జారి గుండం లో పడిపోయాడు… గుండం గురించి తెలువకపోవడం తో మేమందరం పెద్దగా పట్టించుకోలేదు.. పైకి వచ్చేస్తాడుగా అనుకునే లోపు అరుపులు ప్రారంభించాడు ఫైజాన్… అంతలో అతనిని కాపాడటానికి అన్సార్ చేయందించబోయాడు అతనిని కూడ నీటిలోకి లాగేశాడు ఫైజాన్.. ఇద్దరు కూడ కళ్ల ముందే నిమిషం వ్యవధిలో గుండం మధ్యలోకి వెళ్లిపోయారు.. ఏం జరుగుతుందో అర్థం అయ్యే లోపు ఇద్దరు మునిగిపోయారు… గుండం పక్కనే చాల మంది ఉన్న ఎవరు నీటిలో దూకే సాహసం చేయలేదు అంటు విలపించడం ప్రారంభించాడు అతను…
కుంటాలలో స్థానిక పర్యాటకులు ప్రమాద బారిన పడి మరణించిన దాఖలాలు లేవు… స్థానికులకు జలపాతం ప్రమాద ప్రాంతాలపై అవగాహన ఉండటమే దీనికి కారణం… దూర ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులే తరుచుగా ప్రమాదానికి గురౌతుంటారు… ఎవరు చెప్పిన వినరు..ప్రధానంగా యువ పర్యాటకులు మంచి జోష్ లో ఉంటారు కాబట్టి ఎవరు చెప్పిన వారికి ఎదురుగా మాట్లాడుతూ అవమానపరుస్తారు..అక్కడికి వెల్లొద్దు అని భద్రత సిబ్బంది వారించిన వారితోనే కయ్యానికి దిగిన సందర్భాలను చూశాము మేము… ఇక మద్యం మత్తులో గంతులేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… జలపాతం లో మూడు సుడిగుండాలు ఉ్ననాయి.. ఒకటి మొదటి ప్రవాహపు మధ్యలో పైన ఉంటుంది.. రెండోది మొదటి ప్రవాహం దిగువన కింద ఉంటుంది.. మూడవది చివరి ప్రవాహం కింద… సీజన్ లో నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి మూడవ గుండం వరకు పర్యాటకులు వెల్లలేరు..అత్యంత ప్రమాదకరమైనవి మొదటి రెండు గుండాలు… Kuntala Falls- Bitter Memories-03
మొదటి గుండం వద్దనే ఈ ఇద్దరు యువకులు గల్లంతైనది… మొదటి గుండం జాలువారుతున్న ప్రవాహం ధాటికి రాతి శిలపై ఏర్పడిన ఓ పెద్ద బావిలా ఉంటుంది… పైనుండి జాలువారుతు వచ్చిన నీటి ప్రవాహం గుండం లో అర్ధ వలయాకారంలో అంటే అచ్చం సముద్రపు అలల ఆకారంలో సుడి తిరుగుతు ఉంటుంది ..ఈ సుడిలో చిక్కితే ఎంతటి ఈతగాడైన పైకి రావడం కష్టం… అంతే కాకుండా నీటి ప్రవాహానికి గుండంలో గుహ లాంటి ఆకారం ఏర్పడింది..ఆ గుహలో మనిషి చిక్కితే పైకి రాకుండా పైకప్పు రాయి అడ్డుకుంటు బయటకి రాకుండా చేస్తుంది….. ఇక రెండవ గుండం ..పర్యాటకులు తిరిగే , ఉత్సాహంగా గడిపే దగ్గరే ఉంటుంది ఈ గుండం కాబట్టి ఎక్కువ ప్రమాదాలు ఇక్కడే చోటు చేసుకుంటాయి… 2015 లో హైదరాబాద్ నుండి వచ్చిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మరణించింది ఈ గుండం లోనే….
(తరువాయి భాగం రేపు)
సాయి కిరణ్ జాదవ్, రచయిత