Kuntala Falls-6 కుంటాల జలపాతం – చేదు జ్ఞాపకాలు
Kuntala Falls – 6
కుంటాల జలపాతం – చేదు జ్ఞాపకాలు
జలపాతం గుండంలో తప్పి పోయిన వాళ్ల కోసం గాలింపు.. సోమన్న నేతృత్వంలోని పన్నెండు మంది గాలిస్తున్నారు. ఆ దృష్యాలను చిత్రీకరిస్తున్నాం. ఆ వెంటనే వార్త ను కంపోజ్ చేసి ఆఫీస్ కు పంపాలంటే ఇంటర్ నెట్ కోసం జలపాతం నుండి 5 కి.మీ దూరం వెళ్లాలి. 400 మెట్లు దిగితే జలపాతం వస్తోంది. అక్కడి వీడియో తీసి వార్త కంపోజ్ చేసి ఆఫీస్ కు పంపడం ప్రతి రిపోర్టర్ కు సమస్యే.
వార్త సేకరణ కోసం ఎన్ని బాధలో..
తప్పి పోయినోళ్ల కోసం గాలిస్తుంటే రిపోర్టర్ లుగా ఆ వార్త కవరేజ్ కోసం మా తంటాలు. గజ ఈతగాళ్లు గంటన్నర నుంచి గాలిస్తున్న మృత దేహాలు లభ్యం కాలేవు. నీటి అడుగు భాగంలోకి వెళ్లి గాలించి ఆక్సిజన్ కోసం గజ ఈతగాళ్లు పైకి వస్తున్నారు. వరద నీరు బురదగా ఉంది. కాళ్లతో, చేతులతో వెతుకుతున్న ఫలితం శూన్యం. సముద్రంలో డైవింగ్ సూట్, ఆక్సిజన్ బ్యాగ్ సహాయంతో నీటి లోపల గాలిస్తుంటారు.. కానీ, ఈ గజ ఈతగాళ్లకు డైవింగ్ సూట్, ఆక్సిజన్ లేకుండానే గాలిస్తున్నారు. సముద్రంలో డైవింగ్ చేసే సాహసీకులతో పోల్చితే వీరి ధైర్య గొప్పదనిపించింది. న్యూస్ బులెటిన్ లో ఎప్పటికప్పుడు అఫ్ డెట్ ఇవ్వడానికి అరగంటకోసారి 400ల మెట్లు ఎక్కడం.. దిగడం దిన చర్యగా మారింది. ఆ కష్టాలను మాటల్లో చెప్పలేం. పై నుంచి నీటి ప్రవాహం తగ్గడానికి గజ ఈతగాళ్లు అడ్డు వేసారు. కొంత ప్రవాహం తగ్గింది. రెండున్నర గంటల తరువాత మృతదేహంను కనుగొన్నారు Kuntala Falls గజ ఈతగాళ్లు.
మృత దేహాలను చూసి..
ఆ మృతదేహం ఫైజాన్ ది. జీన్ ప్యాంటు, షర్టు, కాళ్లకు ష్యూ లు అలానే ఉన్నాయి. ఆ మృతదేహం వీడియో చిత్రీకరించి మల్లీ మెట్లెక్కి వార్తను పంపాం. రెండు గంటలవుతుంది. ఆకలవుతుంది. అయినా.. డ్యూటీ ముఖ్యమని కిందికి వెళ్లాం. అన్సార్ మృత దేహంను గజ ఈతగాళ్లు నీళ్ల లోతుల నుంచి పైకి తెచ్చారు. జలపాతం చూస్తూ ఎంజాయ్ చేద్దామని వచ్చిన స్నేహితులు ప్రమాదంను ఊహించలేక పోయారు. మృతదేహాలను చూసి దు:ఖంను ఆపుకోలేక స్నేహితులు రోదిస్తున్నారు. టార్సాలిన్ లలో మృతదేహాలను చుట్టి కట్టెలకు కట్టి పైకి తీసుకు వచ్చారు Kuntala Falls గజ ఈతగాళ్లు. అక్కడే ఆ మృత దేహాలకు పోస్ట్ మార్టం చేసారు. విగత జీవులుగా మారిన మృతదేహాలపై పడి కుటుంభీకులు రోదిస్తున్నారు.
నిర్లక్ష్యంతోరే గాల్లో ప్రాణాలు..
యువకులు మరణించడానికి సెల్ఫీ మోజు, నిర్లక్ష్యం కారణమనిపించింది. జలపాతం వద్ద వరుస ప్రమాదాలు జరుగుతున్న పాలకులు, అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తలు తీసుకోక పోవడం మరో కారణం అనిపించింది. ఆ రోజు పది సార్లయిన వార్తల ఆఫ్ డెట్ ఇవ్వడానికి 400 మెట్లు ఎక్కడం.. దిగడం ఎంత కష్టమో జీవితంలో మరిచి పోలేం. ఒక వార్త సేకరణ కోసం ఇంతగా కష్ట పడుతుంటే సమాజంలో ఆ గుర్తింపు కూడా లేకుండా పోయింది. వేసవిలో ప్రమాదానికి కారణమైన గుండంలో కాంక్రీట్, సిమెంట్ తో మూసి వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని గిరిజనులు వ్యతరేకించారు. అయితే.. ఈ Kuntala Falls జలపాతం మధ్యలో సోమేశ్వరుడి దేవాలయం ఉండంటంతో పుణ్యక్షేత్రంగా భావించి పర్యాటక కేంద్రంగా ఇంకా అభివృద్ది చేయాలని కోరుతున్నారు గిరిజనులు.. ఇప్పుడైతే పర్యాటకులు ఆ గుండం వద్దకు వెళ్లకుండా కంచెను ఏర్పాటు చేశారు. End..
సాయి కిరణ్ జాదవ్, జర్నలిస్ట్, బోథ్ డివిజన్