బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ జగదీశ్ రెడ్డి తో కలిసి రేపు (6న జనవరి ) హుజూర్ నగర్, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు..
పర్యటన వివరాలు:
ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి.. ఉదయం 10:50 గంటలకు హుజూర్ నగర్ పట్టణానికి చేరుకుంటారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద స్థానిక ఎమ్మెల్యే శ్రీ సైదిరెడ్డి గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు గ్రీన్ వుడ్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1:45 గంటలకు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శ్రీ సైదిరెడ్డి నివాసంలో లంచ్ చేస్తారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు హుజూర్ నగర్ పట్టణం నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి.. మధ్యాహ్నం ౩ గంటలకు మునుగోడు నియోజకవర్గం, చండూర్ టౌన్ కు చేరుకుంటారు.
మధ్యాహ్నం ౩:30 గంటలకు గట్టుప్పల్ మండల కేంద్రంలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను ప్రారంభిస్తారు.
సాయంత్రం 4:30 గంటలకు చండూరు పట్టణానికి చేరుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు.