AP 39TV 23 ఫిబ్రవరి 2021:
అనంతపురం జిల్లాలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సి నేషన్ ప్రారంభమైంది. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పని చేస్తున్న పోలీసు సిబ్బంది కోసం స్థానిక డి టి సి లో కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి కోవ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రతి పోలీస్ సిబ్బంది కో వ్యాక్సిన్ను వేయించుకునేలా జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS సూచనలు జారీ చేశారు. జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది సమీప పీహెచ్సీలలో ఈ వ్యాక్సిన్ వేయించుకునేలా ఏర్పాట్లు చేశారు.