Header Top logo

Kompally Park Muchata .. కొంపల్లి పార్క్ ముచ్చట..

హైదరాబాద్ ముచ్చట్లు..

Kompally Park Muchata ..

కొంపల్లి పార్క్ ముచ్చట..

కాంక్రీట్ జంగిల్ గా మారిన హైదరాబాద్ నగరంలో పార్క్ కనిపిస్తే అక్సిజన్ ఫీల్చుకున్నట్లే ఫీలింగ్.. ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున లేవగానే వాకింగ్.. యోగ.. ఎక్సర్ సైజ్ చేయకుంటే ‘హాయ్..’  అంటూ ఆనారోగ్యం పలుకరిస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యంగా ఫీలాయ్యేవాళ్లు.. యాభై ఏళ్లు దాటినోళ్లు.. పొద్దున్నే పార్క్ లోకి ప్రయాణం తప్పనిసరి.హైదరాబాద్ నగరం కొంపల్లి రెనోవా హాస్పిటల్ లైన్ లో ముందుకు వస్తుంటే కనిపిస్తోంది బుచ్చి పార్క్. పొద్దున్నే ఆ పార్క్ సీనియర్ సిటిజన్ ల ‘మార్నింగ్ వాకింగ్’తో కళ కళలాడుతుంది. ప్రేమతో ‘గుడ్ మార్నింగ్’ అంటూ పలుకరిస్తూ నవ్వుతూ వాకింగ్ చేసే వారే ఎక్కువ.

ప్రత్యేకంగా వేసిన వాకింగ్ బాట.. ఆ బాటకు ఇరువైపుల రంగు రంగుల పూల మొక్కలు.. ఎత్తుగా పెరిగిన భిన్నరకాలైన చెట్లు ఇలా ఒక్కటా.. రెండా ఎన్నో వెరైటీలు. ఈ పార్క్ లో పూసిన పూలను దేవుడికి పూజ చేయడానికి తీసుకెళ్లేవాళ్లున్నారు.

అయితే.. ఓ పెద్దాయన మాత్రం ఆ పార్క్ లో వాకింగ్ కంటే కూడా పని చేస్తూనే కనిపిస్తుంటాడు. ఆ పార్క్ ను  అతను చంటి పిల్లలా చూస్తుంటాడు. మొక్కలకు పూలు పూస్తుంటే దగ్గరకు వెళ్లి తదేకంగా చూస్తూ సేద తీరుతుంటాడు. ఎన్నో నెలలుగా అతనిని చూస్తున్న అతనిని పలుకరించాలనే ఆలోచనను బలవంతంగా విరమించుకున్నాను. రోజులా పార్క్ లో శుక్రవారం ‘యోగ-సూర్య నమస్కారాలు’ చేస్తుంటే ఆ పెద్దాయన కనిపించారు. దగ్గరకు వెళ్లాను. మొక్కకు ఎండి పోయిన ఆకులను తెంపుతున్నఆ పెద్దాయన నన్ను పట్టించుకోలేదు.

‘‘సార్.. యువర్ గుడ్ నేమ్..? మీరేమి చేస్తుంటారు..?’’ కూల్ గా నవ్వుతూ పలుకరించాను.

‘‘నా పేరు వెంకట్ రెడ్డి, నిజామాబాద్

.. ఇది వరకు నాకు కోళ్ల ఫాం ఉండే.. కొడుకు మనోజ్ రెడ్డి కెనడలో జాబ్ చేస్తున్నాడు. కూతురు దీక్ష చదువుతుంది. ఇప్పుడు ఖాళీగానే ఉంటూ ఈ పార్క్ ను పర్యావేక్షిస్తుంటా..’’ అన్నారు వెంకట్ రెడ్డి.

‘‘పార్క్ ప్రైవేట్ కాదు గదా.. ఇవన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది కదా..?’’

‘‘ప్రభుత్వం అభివృద్ది అంతా కాగితాలకే పరిమితం. ఈ మధ్యనే పార్క్ లో పిల్లలు ఆడుకోవడానికి అగో అవన్నీ నలుపై వేలకు నేనే కొనిచ్చాను. ఈ పార్క్ చుట్టూ అపార్ట్ మెంట్ లలో ఉండే కొందరు ఇచ్చిన విరాళాలతోనే పార్క్ అభివృద్ది చేశాం. ప్రహారి గోడకు మాత్రం ప్రభుత్వం నిధులు ఇచ్చింది.’’

ఆ సమయంలో పార్క్ లో వాకింగ్ చేయడానికి వచ్చాడు సినియర్ సిటిజన్ విశ్వనాథ్.

‘‘సార్.. నిన్న మీరు రాలేరెంటి..? పార్క్ అభివృద్ది చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ వెంకట్ రెడ్డి దంపతులను సన్మానించుకున్నాం.’’ అని ఫోటోలు చూపించారు విశ్వనాథ్.

‘‘వెంకట్ రెడ్డి సార్.. మీకు ఈ కాలోని వాసులు సన్మానం చేస్తే ఎలా ఫీలాయ్యారు..?’’  అడిగాను.

‘‘ప్రకృతి అంటే నాకు ఇష్టం. పొద్దున లేవగానే ఆ పార్క్ కు వచ్చి గంట పాటు ఏదో పని చేస్తే అదో ఆనందం. ఈ పార్క్ పచ్చని చెట్లతో కళ కళలాడుతుందనే పిల్లలు, యువకులు, వృద్దులు పొద్దున, సాయంత్రం వస్తుంటారు. వాళ్లంతా ఈ పచ్చని వాతవరణంలో కొంతసేపు సేద తీరుతుంటే చూసి సంతోష పడుతాను.’’ వివరించారు వెంకట్ రెడ్డి.

‘‘సార్.. ఈ పార్క్ మా అపార్ట్ మెంట్ ముందు లేకుంటే నేను వాకింగ్ చేసే వాణ్ణి కాదెమో..? మీకు తెలుసా..? ఈ పార్క్ బాగోగులు చూసుకోవడానికి కూడా వర్కర్ లను విరాళాలు ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాం..’’ అన్నాడు విశ్వనాథ్.

గంట పాటు వాకింగ్.. యోగ ముగించుకుని ఇంటికి వెళుతుంటే రోజు తల్లితో పాటు  పార్క్ లో వాకింగ్ చేసే బ్లెస్సీ సైకిల్ తొక్కుతూ కనిపించింది. ఆపీ పార్క్ గురించి పలుకరించాను.

‘‘ఇంటి దగ్గర పార్క్ ఉన్నందున మమ్మితో వచ్చి రోజు వాకింగ్  చేస్తుంటా.. చాలా హెప్పిగా ఉంది.’’ అంది ఆరవ తరగతి చదువుతున్న బ్లెస్సీ.

ముగింపు..

కరోనా కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యం.. మరీ.. మీరు పొద్దున్నే లేసి ఈ పార్కింగ్ లో వాకింగ్ చేయడానికి రావచ్చు గదా..

YATAKARLA MALLESH

 

 

 

 

 

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking