- శత్రువుకు శత్రువు మిత్రుడు అనే విధంగా పని చేయాల్సి వచ్చింది
- టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఈటలకు మద్దతుగా వ్యవహరించాం
- ఈటల 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు
శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం ప్రకారం ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి, చివరకు టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందనే తాము కాస్త వెనక్కి తగ్గామని చెప్పారు. ఈటలకు పరోక్షంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నికల్లో పని చేసినట్టు హుజూరాబాద్ లో తాము చేయలేదని చెప్పారు.