‘‘ఉదయం’’ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్ నగరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 2023 జనవరి 29వ తేదీన ఉదయం 10 గంటలకు ‘‘ఉదయం’’ ఆత్మీయ సమ్మేళనం ప్రారంభమవుతుంది.
సంచలన వార్త కథనాలు ఇచ్చి ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్నా నాటి ‘‘ఉదయం‘‘ ఆత్మీయ కుటుంభీకులు తప్పక హాజరు కావాలి. ‘ఉదయం’తో మీ అనుబంధం.. మీ వార్త కథనాలను.. జర్నలిస్ట్ గా జర్నీ.. మధురమైన తీపీ జ్ఞాపకాలతో తప్పకుండా వస్తారని ఆశిస్తూ..
- మీ ‘‘ఉదయం’’ కుటుంబం
నిజం.. ఉదయంతో అనుబంధం అక్షరాలలో రాయాలేని పదాలు. తూర్పున సూరీడు ఉదయించక ముందే ఇంటింటికీ వెళ్లి ‘‘హాయ్.. గుడ్ మార్నింగ్..’’ అంటూ ఉదయం దిన పత్రికా పలుకరిస్తుంటే హృదయం ఉప్పొంగింది.
‘‘ఉదయం’’ ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాం డిజైన్ చేసినా ఉదయం కుటుంభీకులకు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే.
ఎక్కడెక్కడో రకరకాల ఉద్యోగాలు చేసుకునెటోళ్లు… ఉద్యోగంలో రిటైర్డ్ అయినోళ్లు.. ఇంకా జర్నలిజంలో జర్నీ చేస్తున్నోళ్లు మీ అందరినీ ‘‘ఉదయం’’ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకునే అవకాశం కల్పించిన నిర్వహకులకు పాదాభివందనం.
కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ది చెందని నాటి కాలం నుంచి కంప్యూటర్ యుగంలో ప్రయాణిస్తున్న నేటి కాలం వరకు ఎన్నో.. ఎన్నెన్నో అనుభవాలను మూట కట్టుకున్న జీవితం మనదే.
‘ఉదయం’ అంటే హృదయమే..
‘ఉదయం’ వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్న పోస్ట్ లు చూస్తుంటే నిజంగా సంతోషంగా ఉంది. దొంతరాల మధ్యన దాగిన నాటి ఐడి కార్డులను కొందరు చూసి మురిసి పోతున్నారు. మరి కొందరు అప్పాయ్ మెంట్ ఆర్డర్.. విజిటింగ్ కార్డు.. గ్రూప్ ఫోటోలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో జ్ఞాపకాలు..
జనవరి 29న ‘‘ఉదయం’’ ఆత్మీయ సమ్మేళనంలో మధురమైన మన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటే ఆ ఫీలింగ్ అక్షరాలలో రాయలేమెమో..?
ఉదయం ఆత్మీయ సమ్మేళనం కోసం మన ఆత్మీయుడు కాపర్తి వీరేంద్ర గారు రాసిన పాట వింటుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.
మన ఉదయం..
జన ఉదయం..
ప్రతి ఉదయం..
నవోదయం..
ఉదయం ఒక ఉద్యమం ..
జన క్షేమమే ఆశయం..
ఇగో ఈ సాంగ్ వింటుంటే మనసులోనే కాపర్తి వీరేంద్ర గారికి సెల్యూట్ చెప్పాలనిపిస్తోంది కదూ..
ఫోటో జ్ఞాపకం..
దేవిప్రియ గారు మన మధ్య లేక పోవచ్చు..
కానీ.. అతనితో అనుభవాలు.. జ్ఞాపకాలు మన వెంటే ఉన్నాయి కదూ..
‘‘దేవిప్రియ గారు ‘ఉదయం’ ఆదివారం మేగజైన్ ఎడిటర్ గా వున్న రోజుల్లో చేసిన శ్రీశైలం క్షేత్రయాత్ర మా అందరికీ మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఆనాడు నేను అక్కడి గర్భగుడిలోని జ్యోతిర్లింగం వద్దకు వెళ్లి ‘ఉదయం’ పత్రిక తరఫున పూజలో పాల్గొన్నాం.. ’’
ఇది ఉదయం వాట్సాప్ గ్రూప్ లో పోటో పోస్ట్ చేశారు మనోళ్లు.
ఈ ఫొటోలో వున్న మిత్రులు వరుసగా (ఎడమ నుంచి కుడిికి): ఉదయ్ (సబ్ ఎడిటర్), నాలేశ్వరం శంకరం (కవి), నేను (దోర్బల బాలశేఖరశర్మ, సబ్ ఎడిటర్), వి. కె.అశోక్ (ఆర్టిస్ట్), దేవిప్రియ (ఎడిటర్), నాగేంద్రదేవ్ (సీనియర్ సబ్ ఎడిటర్), జగన్ (ఆర్టిస్ట్), జె.శ్యామల (సబ్ ఎడిటర్), దేవిప్రియ గారి అమ్మాయి.
ఉదయం ఐడి కార్డు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి కదూ..
‘ఉదయం’ విలేకరిగా ప్రింటింగ్ ప్రెస్ లో చేయించుకున్న విజిటింగ్ కార్డు..
‘ఉదయం’ నుంచి వచ్చిన లేఖలు..
‘ఉదయం’ అనుభవాలు ఎన్నో.. ఎన్నెన్నో వాటిని మనం ‘‘ఉదయం’’ ఆత్మీయ సమ్మేళనంలో షేర్ చేసుకుందాం..
చివరగా మన ‘ఉదయం’లో ఉన్న స్వేచ్ఛ గురించి రాసి వాట్సాప్ గ్రూప్ లో చేసిన పోస్ట్ ఇది.
Helo సామీ..ఇది ఈనాడు group కాదు..ఉదయం !! మనకి బోర్డర్స్ లేవు..ఈనాడోడిలా శిల్పం..గిల్పం అంటానికి ఏనాడో చేరిపేశాడు abk.. డెస్కుల్లో సిగరేట్స్ కాలుస్తూ పనిచేసిన స్వర్ణయుగం మన ఉదయానిది..!! మన హృదయచప్పుడు.. సంకల్పం ఉదయం..జీతాలు సరిపోకపోయినా..late అయినా ఎడిషన్ ఆగలేదు..మరీ ముదిరితే తప్ప..!! అంచేత restrictions పెట్టకుండ్రి☺️అలాగని రెచ్చిపోయే వయసుకాదు.. కుసంస్కారులు కారు ఉదయం బ్యాచ్..sorry to say.. నన్ను suspend చేసినా no ప్రాబ్లెమ్😊!! జస్ట్ చెప్పాలనిపించి చెప్పా.. చైతన్య కరెక్ట్ గా connect అయ్యాడు.. కవి హృదయం కదా అర్ధంచేసుకున్నాడు..!! Cool..!!
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్