Header Top logo

ఫస్ట్ నైట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్..

జైల్ ఊచలు లెక్కిస్తున్న పెళ్లి కొడుకు

అమరావతి : సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో యువత చెడు ఆలోచనలు పెరిగి పోయాయి. రహస్యంగా జరుపుకోవాల్సిన ఫస్ట్ నైట్ ను సీక్రెట్ గా వీడియో తీసిన యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. అతను పెళ్లి చేసుకున్న భార్య సైతం మేజర్ కాలేదని తేలడంతో అన్నీ కేసులు పెట్టి జైల్ లో వేశారు పోలీసులు.

ఈ సంఘటన కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో జరిగింది.  ఫిబ్రవరి 8న బాలికతో యువకుడి వివాహం జరిగింది. ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను సోషల్ మీడియా కెక్కించేసి కలకలం రేపిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బాలిక తల్లి ఫిర్యాదుతో అరెస్ట్

సోషల్ మీడియా వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం కొందరితో పిచ్చి పనులు చేయిస్తోంది. విచక్షణ కోల్పోయి రహస్యాలను కూడా బయటపెట్టేసుకుని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో ఇలాగే జరిగింది.

గత నెల 8న గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు 20 ఏళ్ల యువకుడితో వివాహం జరిగింది. ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను వీడియో తీసి వాటిని అతడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా కలకలం రేగింది.

విషయం తెలిసిన బాలిక తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని కాట్రేనికోన పోలీసులు నిన్న వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking