Jai Bhim goes viral on Facebook ‘‘జై భీమ్’’ సోషల్ మీడియాలో వైరల్
Jai Bhim goes viral on Facebook
‘జై భీమ్’ సినిమా సోషల్ మీడియాలో వైరల్
జై భీమ్ సినిమా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఆ కథ కమ్యూనిష్టులది. కానీ ‘‘జై భీమ్’’ టైటిల్ తో బాధితుల కన్నీళ్లు హైలెట్ అయ్యాయి. కమ్యూనిష్టుల పాత్ర కనుమరుగైంది. ఇప్పుడంతా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెద్కర్ పై చర్చ కొనసాగుతుంది. జై భీమ్ సినిమాను మెజార్టీ ప్రజలు సమర్థించారు. అక్కడక్కడ ఆ టైటిల్ పెట్టడం తప్పు అంటూ సోషల్ మీడియాలో కమ్యూనిష్టుల పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. సినిమాను ద్వేషించే కమ్యూనిష్టులు ఉన్నందుకు జాలి పడుతున్నామని ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.
సినిమాలోని పాత్రలు..
గోవిందన్ పీడిత ప్రజల తరపున నిలబడి ఉద్యమం చేస్తున్న సిపిఎం నాయకులు. డబ్బులకు లొంగకుండా, ప్రాణాలు తీస్తామని బెదిరించిన ప్రజల పక్షణ నిలిశాడు. 13 ఏళ్లు పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరిగారు. రాజమోహన్ సిపిఎం కంపురం తాలూఖ ఆనాటి సెక్రటరీ. బడుగు వర్గాలకు అన్యాయం జరిగితే వారితో పాటు ధర్నాలు చేసిన నాయకులు. బాలకృష్ణన్ సిపిఎం రాష్ట్ర నాయకులు గిరిజన ప్రాంతాలలో తిరుగుతూ వారికి జరిగే అన్యాయాలను లాయర్ చంద్రు దృష్టికి తీసుకెళ్లిన నాయకులు. ఆరివోలి ఇయాక్కం.. టీచర్ గా కమ్యూనిష్టు పార్టీ సైన్స్ విభాగం వాలంటీర్. పేదలకు విద్య బోధించిన కామ్రేడ్.
-
ఈ సినిమా టైటిల్ కి, కథకు సంబంధం ఏంటి..?
ఆ పేరు ఎందుకు? “జై భీమ్” అంటే అంబేద్కర్ కి సంబంధించిన పదం. అణగారిన కులాల ప్రజల మీద జరిగే అన్యాయం, పోరాటాలే ఇతి వృత్తంగా తీసిన సినిమా కాబట్టి ఆ పేరు పెట్టారా? ఒక మనిషి ప్రతిభను కృషిని కేవలం కులానికి పరిమితం చేయడం అన్యాయమైనా కుల సమాజంలో దాన్ని వేరు చేయలేమని అంబేద్కర్ అభిమానులు నిరూపిస్తునే ఉన్నారు.
– వయ్యామ్మెస్ ఉదయశ్రీ