Header Top logo

Introduction to book ‘Iguram’ ‘ఇగురం’ పుస్తక రచయిత పరిచయం

Introduction to the author of the book ‘Iguram’

‘ఇగురం’ పుస్తక రచయిత పరిచయం

ఇగురం అనే కథా సంపుటితో సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన గంగాడి సుధీర్ తెలంగాణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చాడు. పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్థుత రాజన్న సిరిసిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామం ఆయన జన్మ స్థలం. గంగాడి నర్సారెడ్డి-యాదవ్వ దంపతులకు 1981 అక్టోబర్ 28న ప్రథమ పుత్రుడిగా జన్మించాడు. ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్న మద్య తరగతి కుటుంబంలో చిన్నప్పటి నుండి సాధారణ పరిస్థితుల మద్యే పెరిగాడు.

Introduction to the author of the book 'Iguram'

తల్లీ తండ్రీ లేని ఒంటరి తనం..

చదువంటే ఇష్టం ఉన్నా కొరుకుడు పడని లెక్కల చిక్కులు చికాకులు తెప్పిస్తున్నా.. చదవడాన్నే ఇష్టంగా మలుచుకున్నాడు. 80 నుండి 90 వ దశకానికి వచ్చే సరికి సమాజంపై అవగాహన కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది. సమాజంలో ఉన్న అంతరాలు తెలియకుండా గడిచిన చిన్ననాటి భాల్యం లోని అసమగ్రతలు అవగాహనలోకొచ్చాయి. ప్రాథమిక విద్యాబ్యాసం నాలుగో తరగతి వరకూ తన ఇంటి వద్ద బడిలో చదివాడు. అనంతరం ఐదు, ఆరు తరగతుల కోసం ఆశ్రమ పాఠశాలకు పంపారు తల్లిదండ్రులు. తెలిసీ తెలియని వయసులో తల్లీ తండ్రీ లేని ఒంటరి తనం తనని అంతర్ముఖున్ని చేసి ఉండవచ్చు. Introduction to book ‘Iguram’

అన్నలకు తప్పుడు సమాచారం..

ఈ దశ కూడా పరిపూర్ణ అనుభవంలోకి రాకముందే తన జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. నాటి తెలంగాణ పల్లెల్లోని సామాజిక సంఘర్షణ, ఆర్థిక అసమగ్రతలు, కులాల మద్య కొట్లాటలు అనుకోని విదంగా తన కుటుంభంలో చిచ్చు రేపాయి. తన తండ్రి నర్సారెడ్డి ఎదుగుతున్న తీరు, సమాజంలో దక్కుతున్న హోదా గిట్టని కొంత మంది (నక్సలైట్ల) అన్నలకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి సహాయంతో కొందరు అతని కాలు విరిచేసారు. దీన్నుండి కోలుకోవడానికి మధ్యతరగతి కుటుంబం కాస్తా అదోగతిలోకి జారిపోయింది.

సుధీర్ విద్యాభ్యాసం..

ఈ పరిస్థితి మళ్లీ సుదీర్ ని ఆవునూరి లోనే విధ్యాబ్యాసం కొనసాగేలా చేసింది. అలా ఆరోతరగతి రెండు సార్లు చదివిన సుధీర్ పదో తరగతిని మాత్రం మానేరు నదికి ఆవల ఉన్న వెంకటాపూర్లో పూర్తి చేసాడు. ప్రతీ రోజు మానేరు నదిని దాటుతూ ఆ ప్రకృతిని దానితో మమేకమైన ప్రజల జీవనాన్ని దారిపోడవునా పోతున్నప్పుడు ఎదురైన మాల వాడలు, మాదిగ పల్లెలు అక్కడి అనంతమైన చీకటి అందుబాటులో లేని చదువులు పొలాల్లో శ్రమైక జీవన సౌందర్యాన్ని అనుభవిస్తున్న ఊరి శ్రమజీవుల జీవనం వసంతంలో రెక్కలు విచ్చే మొగ్గలు, జోరెండల్లో ఎండిన చెరువులోని తామర గింజల కమ్మదనం, జోరువానలో గుట్టపై నుండి దూకే జల ప్రవాహం ఇవన్నీ ఆ పద్నాలుగేళ్ల బాలుడిలో ఏదో తెలియని తన్మయత్వాన్ని అదే సమయంలో మెలిపెట్టే బాధని పరిచయం చేసాయి.

సంఘర్షణ నుంచి అక్షరాలు..

ఆ కలగాపులగంగా సుధీర్ మనసు నిరంతరం సంఘర్షిస్తుండేంది. దాన్ని స్థిమిత పరుచుకునే ప్రయత్నంలో అప్రయత్నంగానే అతని భావాలు తన క్లాసు పుస్తకాల్లో అక్షరాల్లా అనునయాన్నివ్వడం మొదలుపెట్టాయి. అలా తన సాహిత్య ప్రస్థానం చిగురించడానికి ఊరు, ఊరిలోని సంఘటనలు బలమైన ముద్ర వేశాయి. అనంతరం ఇంటర్మీడియట్ని సినారే వంటి సాహితీ ఉద్దండులు చదివిన సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీతో ప్రారంభించాడు. డాక్టర్ కావాలన్న తన కలకు మద్యతరగతి కుటుంబం ఆనతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో బీఎస్సీ, పిషరీస్ చదువు కోసం చేరాడు. అక్కడే నందిని సిధారెడ్డి సార్ లాంటి వాళ్ల ప్రేరణ లబించింది, కాలేజీ అన్యువల్ డేలో వరుసగా రెండు సార్లు తన కవితల్ని రాసి ప్రథమ, తృతియ బహుమతులు సాధించాడు.

శ్రీ శ్రీ మహాప్రస్థానం మనసుపై..

Introduction to the author of the book 'Iguram'

అదే సమయంలో తనకు పరిచయమైన స్నేహాలు, రూంలో ఆకలి నేర్పిన పాఠాలు, వెరసి బాహ్య ప్రపంచంలోని పుస్తకాలు తనకు కొంచెం కొంచెం అందుబాటులోకి వచ్చాయి. తొలుత విపుల, చతుర, స్వాతీ పుస్తకంలోని సూర్యదేవర రామ్మెహన్ రావు, యుద్దనపూడి సులోచనారాణి, మధుబాబు వంటి పిక్షన్ రచయితలు తనపై ప్రభావం చూపించినా శ్రీ శ్రీ మహాప్రస్థానం తన మనసుపై బలమైన ముద్రవేసింది, తను పొందిన అనుభవాలు, తను చూసిన సంఘటనలు, తన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సంఘర్షనలన్నీ అక్షరాల్లో సాక్షాత్కరించాయి అనిపించాయి. అంతకుముందు చదివిన నవలలు, సీరియళ్లు కేవలం తనకు ఒక సంతృప్తిని మాత్రమే అందిస్తే తొలిసారిగా శ్రీశ్రీ మహాప్రస్థానం, దాశరథి అగ్నిధార, సినారే విశ్వంభర తనని పూర్తిస్థాయిలో రాయడానికి ఉద్యుక్తున్ని చేసాయి. అలా డిగ్రీ చదువుతున్నప్పటి నుండి రాసిన కవితలు సుధీర్ కు సంతృప్తిని ఇచ్చాయి. ఇదే సమయంలో అనేక మందిని చదువుకున్నా అందులోని సంఘటనలు, సంఘర్శనలు మాత్రమే పట్టించుకొనేవాడు. యదాతథంగా గుర్తుంచుకోవడం అవసరం లేదనేది అతని అభిప్రాయం. అలా ఎవర్ని చదివినా అనుభూతించాడు కానీ జ్ణాపకాల్లో నింపుకోలేదు. పై చదువులు చదవాలంటే డబ్బులు కావాలి.

Introduction to the author of the book 'Iguram'

జర్నలిస్ట్ వైపు అడుగులు..

అప్పటి కుటుంబ పరిస్థితులు దానికి సహకరించవని అర్థమయ్యాక తనకిష్టమైన కెమిస్ట్రీని వదిలేసి మరో ఇష్టమైన జర్నలిజం చదవాలని నిర్ణయించుకొని ప్రతిష్టాత్మక ఆర్ట్స్ కళాశాలలో జర్నలిజం కోర్సు ఎంసీజేలో చేరాడు. అదే సమయంలో ఐఏఎస్సీ మాసబ్ టాంకునుండి బీఈడీ పట్టాపొందాడు. బతుకుబండి లాగడానికి చదువుకుంటూనే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. తొలుత సాయంకాలాలు విజేత కాంపిటీషన్స్ లో పనిచేసాడు. అనంతరం వార్త పేపర్లో ట్రైనీ సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాడు.

ఎలక్ట్రానిక్ మీడియాలో..

అనంతరం ఎలక్ట్రానిక్ మిడియా ప్రభంజనం మొదలైన 2003లో కొత్తగా ప్రారంభమైన ఈటీవీ2లో ప్రోగ్రాం అసిస్టెంట్ గా మొదలై అసోసియేట్ గా 2007లో బయటకొచ్చి టీవీ9లో రెండేళ్ల పాటు పనిచేసాడు. అనంతరం ప్రారంభమైన హెచ్ఎంటీవీలో ప్రొడక్షన్ ఇంచార్జిగా 2015 వరకూ పనిచేసాడు. ప్రస్థుతం కన్సల్టెంటుగా మిడియా రంగంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2008లో జీవన సహచరిగా రేవతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు అబ్బాయిలు శ్రీజన్, శ్రీవర్షిత్ లు జన్మించారు. ఉద్యోగ జీవితం, కుటుంబ జీవితం సాగుతున్నప్పుడే తనకు అందుబాటులో ఉన్న సమయాల్లో తనని కదిలించిన సంఘటనల్ని సాహితీ ప్రక్రియల్లోకి తర్జుమా చేస్తూ వచ్చాడు గంగాడి సుధీర్. అలా ఎన్నో కవితల్ని, కొన్ని కథల్ని రాసుకున్నాడు.

Introduction to the author of the book 'Iguram'

తెలంగాణ ఉద్యమంలో నేను సైతం..

ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ ఉదృతంగా సాగుతున్న సమయంలో ఉస్మానియాలో ఉండి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు సుధీర్. నాటి వేదనాభరిత సమయాల్ని తన కవిత్వంలో అక్షరీకరించాడు. ఎంతోమంది బలిదానాలు సాగుతున్న సమయంలో తల్లడిల్లుతూ కవితలల్లాడు. ఇలా త్వరలో వెలుగుచూడబోయే సుధీర్ కవిత్వం మనకి వస్తు ప్రధానంగా మరొక్కసారి తెలంగాణ నైజాన్ని, ఉద్యమ సమయాల్ని కళ్లముందుంచుతుంది. Introduction to book ‘Iguram’

‘ఇగురం’ పుస్తకంలో..

ప్రస్థుతం వెలువరించిన ‘ఇగురం’ కథా సంపుటిలో మొత్తం పద్నాలుగు కథలున్నాయి. వీటి గురించిన వివరణని పుస్తకంలోని ముందుమాటలో ప్రసిద్ద రచయిత, తెలంగాణ తొలి సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి అధ్బుతంగా విశ్లేషించారు. ప్రతీ కథ తెలంగాణ ప్రాంత నెటివిటీని ప్రతిభింబిస్తూనే విశ్వజనీనమైన సామాన్య మధ్యతరగతి మనుషుల వ్యథల్ని ఆవిష్కరిస్తాయి. సుధీర్ రాసిన కథల్లోని పాత్రలు మనకు నిత్య జీవితంలో ప్రతీ చోట తారసపడుతుంటాయి. ముఖ్యంగా గ్రామీణ రైతుల, వృత్తి పనివారల ప్రేమలు, ఆప్యాయతలు, కుళ్లు, కుట్రలు లేని మనస్థత్వం, కళ్లా, కపటం లేని మాటలు సుదీర్ కథల నిండా మనల్ని పలకరిస్తాయి.

Introduction to the author of the book 'Iguram'

కథల పోటీలలో స్టేట్ ఫస్ట్..

90వ ధశకంలో ప్రజల్ని పట్టి పీడించిన కరువు, దాని పర్యవసానంగా తప్పని వలస బతుకులు కథా వస్తువుగా పుస్తకంలోని మొదటి కథ ‘వలసలు’ అసాంతం ఏకబిగిన మనల్ని చదివిస్తుంది. అచ్చ తెలంగాణ యాసలో సాగుతున్న సంభాషణలు మనింట్లో మాట్లాడుకున్నట్టే అనిపిస్తాయి. ఎరుకలి లాంటి కుల వ్రుత్తులు ఎలా అంతరించిపోయాయో మనకు లీలామాత్రంగా ఈ కథ పరిచయం చేస్తుంది. నాటి సామాజిక జీవనంలో పెనవేసుకున్న అప్యాయతల్ని చెపుతూనే తెలియకుండా ఉన్న వెలిని యదాతథంగా ఈ కథ మనకు పరిచయం చేస్తుంది. వ్యవసాయం సాగని పరిస్థితులకు ప్రకృతి ఎంత కారణమో పాలకుల వైఫల్యం ఎంతనో అర్దం చేయిస్తుంది. చాలా పెద్ద కథ కానీ ముగిసే వరకూ ఎక్కడా ఆగకుండా చదివించడం గంగాడి సుధీర్ రచనా శైళి. రాష్ట్ర స్థాయిలో జరిగిన శ్రీశ్రీ స్మారక కథల పోటీల్లో 2013లో మొదటి బహుమానం పొందింది ఈ కథ.

‘ఇగురం’ ఏంటీ అదే చర్చా..

తర్వాతి కథ ‘ఇగురం’ సైతం అవకాశాలు అందివస్తున్నా జరగాల్సినంత మంచి ఎందుకు జరగటం లేదో అర్థం కాని తత్వాన్ని ప్రశ్న రూపంలో సందించి, సమాదానం కావాలంటే ఉండాల్సిన ‘ఇగురం’ ఏంటీ అనేదాన్ని చర్చించిన కథ. ఇగురం అనేది అచ్చ తెలంగాణ తెలుగు పదం. ప్రాంతం ఫరంగా ఏ బాష అయినా తనదైన ఆస్థిత్వ పదాల్ని ఏర్పాటు చేసుకుంటుంది. తెలంగాణ పదం నుండి అంత బలమైన ఆస్థిత్వ ప్రకటన గల పదం ఇగురం. ఇది నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైన కథ. పనితనంలో అసామాన్య ప్రతిభ కనబర్చే సామాన్య రైతు నేర్వాల్సిన ఇగురాలేంటో చెప్పే కథ. Introduction to book ‘Iguram’

మధ్యతరగతి కుటుంబాల ఆశలు

‘నిశ్శబ్దం’ అర్ధ్రంగా సాగే కథ సామాన్య తెలుగులో నడిచిన కథ. రెండ్రూపాయలు ధానం చేయడానికి సైతం సంకోచించే స్థితిలో ఉన్న మధ్యతరగతి కుటుంబాల ఆశలు, ఉన్న ఇబ్బందులు, చివరకు ఆశను నెరవేర్చుకోలేని నిస్సహాయ పరిస్థితులు చదువుతున్నప్పుడు మన కంటికి నీటిపోరలా అడ్డొచ్చి అక్షరాల్ని మసకబారుస్తాయి. కోలుకోవడానికి సమయం తీసుకొమ్మని చెప్పే ఈ కథ ఖచ్చితంగా చదవాల్సిన కథ ఇదివరకు దిశ పేపర్లో ప్రచురితమయింది కూడా..

కథలు- విశ్లేషణ..

సమకాలీన సంఘటనల్ని ఒక్కో మనిషి చూసే ద్రుష్టి కోణం ఒక్కోలా ఉంటుంది, ‘సమ్మే’ కథలో సుధీర్ తను చూసిన విభిన్న ద్రుష్టికోణాన్ని మనతో చర్చిస్తాడు. చర్చించడమే కాదు తను అనుకున్న దానితో మనల్ని ఏకీభవింపచేస్తాడు. ఇదంతా కథ ముగిసేలోపు మనకు తెలియకుండానే జరిగిపోతుంది. చదివిన తర్వాత మల్లీ ఆలోచించి రచయిత కోణంతో విభేదించి, తర్కించి, మరోసారి మనల్ని చదివించేస్తుంది ‘సమ్మే’ స్వతంత్ర్య తెలంగాణలో తొలి దిక్కార స్వరం వినిపించిన ఆర్టీసీ సమ్మేపై వచ్చిన కథల్లో ఏ రాజకీయ ఇంటర్ ప్రిటేషన్లు లేకుండా సామాన్యుల కోణంలో వచ్చిన కథ బహుసా ‘సమ్మే’ ఒక్కటే కావచ్చు. వెలుగు పత్రికలో ప్రచురితమైన కథ ఇది.

ఓ గెలుపు జ్ణాపకం..

సుధీర్ కథల్లో మరో విభిన్న కోణాన్ని పరిచయం చేసే కథ ‘ఓ గెలుపు జ్ణాపకం’ ఈ కథా వస్తువు కూడా మధ్యతరగతి జీవితమే కానీ దీని సినిమాటిక్ ముగింపుతో తెలుగులోని సగటు కథల్లో ఒక మంచి కథగా దీన్ని తీర్చిదిద్దాడు రచయిత. ‘వివక్ష’ కథ సుధీర్ రాసాడు అనడం కన్నా సమాజంలో చర్చకోసం వదిలాడు అనేది కరెక్టు అనిపిస్తుంది. కథ అసాంతం ప్రథమ పురుషలో కవి చెపుతున్నట్టుగా అనిపించినా సమాజంలో వివక్షతలను ఎదుర్కొంటున్న సమూహాల పక్షాన తన కలాన్ని ఉంచాడనిపిస్తుంది. ప్రస్థుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, వర్గాల మద్య పెరుగుతున్న అంతరాలు ఎవరి దృష్టికోణంలో వారు చెపుతూ నెగ్గాలనుకుంటున్న సమయంలో ‘జైబీమ్’ సినిమా రేపిన చర్చకు సమానమైన చర్చ ‘వివక్ష’ తీసుకొస్తుంది. గత ఆదివారమే నవ తెలంగాణలో ప్రచురితమైన ఈ కథ, తప్పక చదవాల్సిన తెలుగు కథల్లో ఒకటి. Introduction to book ‘Iguram’

‘ఇగురం’ సైతం అవకాశాలు అందివస్తున్నా జరగాల్సినంత మంచి ఎందుకు జరగటం లేదో అర్థం కాని తత్వాన్ని ప్రశ్న రూపంలో సందించి, సమాదానం కావాలంటే ఉండాల్సిన ‘ఇగురం’ ఏంటీ అనేదాన్ని చర్చించిన కథ.

లాక్ డౌన్ లో..

‘లాక్ డౌన్’ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ఈ కథ, గంగాడి సుధీర్ కరోనా అనంతరం పరిస్థితుల్లో యావత్ జాతిని, ప్రపంచాన్ని దిగ్బ్రమకి గురిచేసిన వలస కూలీల నేపథ్యం ప్రధానాంశంగా కొనసాగింది. దిగువ మద్యతరగతి, అట్టడుగు ప్రజల జీవన విషాదాల్ని ప్రకటిస్తుంది ఈ కథ. కరోనా సంక్షోభం ప్రపంచానికి పరిచయం చేసిన జీవితాలను అక్షరబద్దం చేసిన కథ ఇది. ‘ఆకలిరోగం’ ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా రోగం కన్నా అత్యంత భయంకరమైన రోగం ఆకలి అని ప్రకటిస్తాడు రచయిత. ఉన్నోన్ని కరోనా ఏం చేసింది. ఏ కాస్తో ఆపీసు బాదలు, ట్రాపిక్ చిక్కులు లేకుండా ఎంత సౌఖ్యాలు అనుభవించేలా చేసింది చెప్తూనే లేనోని నిరంతర సంఘర్షణని బయటపెట్టింది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల రెక్కల్ని కరోనా రక్కసి విరిచేసిన తరువాత సంబవించే ఆకలి రోగం ఎలా తాండవం చేస్తుందో మన ఊహకే వదిలేస్తూ రచయిత కథనం నడిపిన తీరు మనల్ని మరోసారి కట్టిపడేస్తుది. వెలుగు పత్రికలో ప్రచురితమైన కథయిది.

కరోనా కాలంలో కథలు..

‘పోలీస్ రియల్ వారియర్’ సిటీటైమ్స్ పత్రికలో ప్రచురితమయింది, కరోనా సంక్షోభంలో పోలీసుల కష్టాల్ని చర్చించిన కథ ఇధి, ’పొక్కిలి‘, ’కరోనాటైమ్స్‘, ‘రికవరీ’ కథలను కరోనా నేపథ్యంలోనే రాసినా వేటి నేపథ్యం దానికదే భిన్నంగా ఉండి మనకు ఎన్నో వైరుద్యాల్ని పరిచయం చేస్తాయి. ఇక ‘సండే సరదా’ కథ వీటన్నింటికీ భిన్నంగా సరదాగా సాగిపోతుంది. ‘ముంపు’ హైదరాబాద్ వరదల నేపథ్యంలో అల్లిన కథ, మధ్యతరగతిలో సైతం ఉండే కక్కుర్తి, దానికి కారణమైన అంతర్గత సంగతులు అన్నింటినీ వివరిస్తూ… సుధీర్ మనలోని అల్పబుద్దిని ఎత్తిచూపుతూనే అనివార్యంగా ఆ పరిస్థితుల్లోకి మనల్ని నెట్టేస్తున్న పరిణామాలపై విరుచుకుపడతాడు. Introduction to book ‘Iguram’

సోషల్ మిడియాకు సమాజం..

సాంకేతికత పెరిగి అరచేతిలో సమస్తాన్ని చూపించే సెల్ పోన్కి అందులోని సోషల్ మిడియాకు సమాజం దాసోహమైన పరిస్థితుల్లో, చదవడానికి, చదివించడానికి సైతం అదే ఊతమివ్వబోతుందంటాడు సుధీర్, పుస్తకాలు కొనడం, వాటిని సేకరించి భద్రపరుచుకొని చదవడం, వ్యయంతో కూడిన ప్రయాస కన్నా… సమయాన్ని వెచ్చించలేని స్థితే కాని చదవడం అనేది ఇప్పటికీ అనేక మందికి ఇష్టంగా ఉన్న వ్యసనమే అనేది అతని అభిప్రాయం. అందుకే ఏ సెల్పోన్ అతనికి ప్రపంచాన్ని చూపిస్తోందో అందులోనే వారకి అందుబాటులో ఉండేలా రచయితలు ప్రయత్నించాలనేది తన అభిప్రాయం. అందుకోసం సాంకేతిక పరిజ్ణానాన్ని, అవకాశాల్ని రచయితలు అందిపుచ్చుకోవాలంటాడు గంగాడి సుధీర్.

‘ఇగురం’ ప్రతీ ఇంట్లో ఉండవల్సిన పుస్తకం

మొత్తంగా గంగాడి సుధీర్ కథా సంపుటి ‘ఇగురం’ ప్రతీ ఇంట్లో ఉండవల్సిన పుస్తకం. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సాహిత్యాన్ని మించిన వస్తువు మరొకటి లేదనే సత్యాన్ని నిరూపించే పుస్తకం. బిజీ జీవితంలో పడి మనం చూడడం మరిచిన మనచుట్టూ ఉన్న సంఘటనల్ని మరోసారి మనకు పరిచయం చేసే పుస్తకం. అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో, అమెజాన్లోనూ సుదీర్ ఈ పుస్తకాన్ని అంధుబాటులో ఉంచాడు. ‘ఇగురం’ గంగాడి సుధీర్ని రచయితగా నిలబెడుతుందనే నమ్మకం ఉంది. మరిన్ని మంచి పుస్తకాల్ని అతడు అంధుబాటులోకి తేవాలని కోరుకుంటుంది జిందగీ.

యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking