International Men’s Day అంతర్జాతీయ పురుష దినోత్సవం
International Men’s Day
అంతర్జాతీయ పురుష దినోత్సవం
పాపం మగాడు
అతడు
దేహ బలముందని
విర్ర వీగుతాడు..!
కానీ!
ఆమె
మనో బలం ముందు
ఓడిపోతాడు..!!
అతడు
ఒరలో కత్తు లెన్నో
పెట్టుకుంటాడు..!
కానీ
ఆమె
ఓర చూపు కు
చిత్తై పోతాడు…!!
అతడు
బయట ప్రపంచపు మాటలెన్నో మాట్లాడుతాడు..!
కానీ!
ఆమె
ఇంట్లో మౌనం వహిస్తే
విల విల లాడిపోతాడు ..!
అతడు
ఆమెనుకట్టడి చేసానను కుంటాడు
కానీ!
ఆమె కు
అతడు బంది అయిపోయానని
తెలుసు కోలేడు..!
మార్చి
8 న మహిళా దినోత్సవానికి
ఆమె పైనకవితలెన్నో రాస్తాడు..!
కానీ
నవంబర్
19 న పురుషదినోత్సవానికి
ఏమి వ్రాయాలి అని
తెల్లమొహం పెడతాడు
కానీ
పాపం
అతడంతే
అతడి కంటూ ఓ రోజుందని
తెలియని
అమ్మా యక జీవి…!!
అంతర్జాతీయ పురుష దినోత్సవము
19-11-21 సందర్భము