సిరా చుక్కలు
బతుకు బాధల కలరాత
ఈ పుస్తకం రచయిత ఎస్. సుధాకర్ కలం నుంచి రూపుదిద్దుకుంది. సమాజంలోని కుళ్లును కడిగేాయాలని రచయిత ఉడుకు రక్తంలో తుపాకీ పట్టారు. ఈ వ్యవస్థతో యుద్దానికి సై అంటే సై అన్నాడు. కానీ.. కాల క్రమేణ గన్ కంటే పెన్ను గొప్పదని జర్నలిస్ట్ గా మారారు. అక్షరాలను ఆయుదంగా చేసుకుని ఈ వ్యవస్థలోని ఆవస్థలపై ఉగ్రరూపం చూపించారు. ఇగో.. అలా రాసిన వ్యాసాలే ఈ ‘‘ సిరా చుక్కలు – బతుకు బాధల కలరాత’’ పుస్తకం. హైదరాబాద్ నగరం కాచిగూడ చౌరస్తాలోని ఆర్యసమాజ్ ఎదుటి సందులో నవోదయ బుక్ హౌజ్ లో లభిస్తోంది. వివరాలకు 9000413413 కాల్ చేసి విలువైన ఈ పుస్తకం కొనుక్కొని చదువండి.
– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
———————-
‘‘సిరా చుక్కలు – బతుకు బాధల కలరాత’’ ఈ పుస్తకంకు ముందు మాట రాసింది ఎడిటర్ కె.రామచంద్రమూర్తి గారు.
ముందుమాట
ఈ పుస్తకంలో నక్సలిజానికి సంబంధించిన వ్యాపాలే కాకుండా అంతర్జాతీయ, జాతీయ పరిణామాలపైన స్పందనలు ఉన్నాయి.
వ్యంగ్యాస్త్రాలూ, చురకలూ, చమత్కారాలూ సందర్భానుసారంగా కనిపిస్తాయి. అక్షరాన్ని సంధించడం, దూయడం వంటి అక్షర విన్యాసాలు తరచుగా తారసపడతాయి. కేవలం రాజకీయ సామాజికాంశాలే కాకుండా ఆర్థిక పరిణామాలపైన కూడా సుధాకర్ సాధికారికంగా వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఆర్థిక మాంద్యం, చైనా వెదురు తెరకు చెదలు, ఇంక రావణ రాష్ట్రం, ఉగ్రవాద పోషణలో అమెరికా- సోవియట్ యూనియన్ ల పాత్ర, మయన్మార్ లో ఆంగ్ పాస్ సూకీ వీరోచిత పోరాటం వంటి అనేక ఆలోచనాత్మకమైన వ్యాసాలు సహా ‘కోర్టులలో ‘జన న్యాయం’ శీర్షిక మెదడుకు పని చెబుతాయి.
రచనా కాలంలో సంభవించిన పరిణామాలను పురస్కరించుకొని. ఘటనల నేపధ్యం, తార్కికం, పర్యవసానాలు ప్రస్తావిస్తూ మార్క్సిస్టు దృక్పధంతో విశ్లేషణ విజ్ఞానదాయకంగా సాగుతుంది.
ప్రతి ఆలోచనాపరుడూ విధిగా చదవదగిన పుస్తకం ఇది.
కె. రామచంద్రమూర్తి, ఎడిటర్