AP 39TV 29మార్చ్ 2021:
అనంతపురం రూరల్ టీడీపీ ఎంపీటీసీ 1 అభ్యర్థి పద్మావతి, టీడీపీ నేత రాజు లతో పాటు పలువురు ఆదివారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నివాసంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తాము వైసీపీ లో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉదయ్ శంకర్, నాయకులు జయరాం నాయుడుతో పాటు రూరల్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.