AP 39TV 09ఏప్రిల్ 2021:
48 వ వార్డులో ప్రచారంలో సాయినగర్, రాజీవ్ నగర్, ఆశ్రమం ఏరియాల్లో టిడిపి నాయకుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గత 2 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న అవస్థల గురించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి ని భారీ మెజారిటీతో గెలిపించి తిరుపతి అభివృద్ధి కి సహాయపడాలని ప్రజలను కోరారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర్ల మురళి,48 వ వార్డు కో ఆర్డనేటర్ కొనంగి శ్రీరాములు, ఆధ్యక్షులు శాఖమూరి తిరుమల నాయుడు, ఉపాధ్యక్షులు కొదకంటి వెంకట రమణ ఆచారి, కార్యదర్శి విజయ్ కుమార్, మరియు బూత్ ఇంచార్జులు కిన్నెర సాయి, లత, శ్యామల, తులసి, కార్తిక్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.