Her struggle with death మృత్యువుతో ఆమె పోరాటం
Her struggle with death
మృత్యువుతో ఆమె పోరాటం
అర్థరాత్రి నాపోత్తి కడుపును
సున్నితంగా తాకుతున్న స్పర్శ….
ఆది నవమాసాలు నాలోనే ఉంటూ
నన్ను అమ్మను చేసిన చిన్ని చేతుల్తో
మాతృత్వంను గుర్తు చేసిన స్పర్శకాదు!
మగాడు అనే మృగం మత్తులో
బాలింతను అనే విచక్షణ మరచి
కోరికల కొలిమిలో తాను కాలిపోతూ
నా మనసును కాల్చివేసేలా!
తాకిన మూడు ముళ్ళు బంధానికి
అర్దం తెలియని …భర్త స్పర్శ అది.
నేల పైన పరుచుకున్న దుప్పటి తడిసి పోయింది.
బహుశా అకృత్యాన్ని తట్టుకోలేక
నయనం కార్చిన వేదన చినుకులు వల్లనేమో…!
దాంపత్యం అంటే
చీకట్లో తాను గెలిచాను అనుకుంటూనే.
భార్య మనసుముందు ఓడిపోయిన భర్త…
శరీరాలు రాపిడే ఇది దాంపత్యం కాదు
అనే భార్యకు మధ్య చీకటీ మౌనంగా నిలిచింది
వైవాహిక జీవితమంటే ఇదా! అని ప్రశ్నిస్తుంది.!
గడచిన నాలుగు గంటల నుండి నెప్పులు భరిస్తూనే ఉన్నా..
ఇంటెన్సిటీ కేర్ యూనిట్ లో!
ప్రసవ వేదనతో కాదు!
ఆడబిడ్డ వద్దు అనే నా భర్త
కడుపుపై తన్నిన దెబ్బకు. తాళలేక…!,
నిశ్శబ్దాన్ని నాలోనే నిలుపుకుంటూ..!
బిడ్డకు జన్మనివ్వాలనే కోరికతో మృత్యువుతో
పోరాడుతున్నా…
రాము కోలా, కవి
సెల్: 9849001201