Helmet is wrong at home గా ఇంట్లో హెల్మెట్ తప్పని సరి
Helmet is wrong at home
గా ఇంట్లో హెల్మెట్ తప్పని సరి
గీ ముచ్చట ఇన్నారుళ్లా గాళ్ల ఇంట్లో కూడా హెల్మెట్ పెట్టుకుంటారట. గిదేంది రోడ్ పొంటి పోంగ ఏదైన మోటరచ్చి గుద్దుతాదని హెల్మెట్ పెట్టుకొమ్మని సర్కార్ ఖనూన్ తెచ్చింది. పెట్టుకోనోళ్లకు ఫైన్ కూడా వేత్తది. ఇంట్లో హెల్మెట్ పెట్టుకొమ్మనే ముచ్చట సర్కార్ చెప్పలేదనుకుంటున్నారా..? నిజమే ఇగో గా ముచ్చట విన్నంక నాకు విచిత్రం అనిపించింది. నమ్మడం లేదా అయితే మన తెలంగాణలోని నల్గొండ జిల్లా ఉంది కదా నకిరేకట్ మండలం పన్నాల గూడెం వెళ్లితే ఓ ఇంట్లో అందరూ హెల్మెట్ పెట్టుకుని కనిపిత్తరు.
అగో ఇంట్లో హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటుండ్రని కారణం తెలిస్తే నవ్వాపుకోలేవు తెలుసా..? గా ముచ్చట కూడా నేనే జెపుతా. గాళ్ల ఇంటి ముందర అరటి చెట్టు పెంచుకుండ్రు. పిట్టలు ఊకుంటాయా…? గవ్విటికి కూడా మన లెక్క రాత్తిరికి పండుకోడానికి ఇల్లు కావాలి గదా.. ఇగో ఆ పిట్టలు ఇగురంతో గా అరటి చెట్టు మీద గూడు పెట్టుకున్నయి. ఇగ గప్పుడే అసలు కథ షురువైంది. ఆ అరటి చెట్టు దగ్గర నుంచి ఓళ్లన్న పోతే వెంబడ పడి పొడుస్తుంటాయి. గా పిట్టల బాధలు తట్టుకోలేక ఆ ఇంటోళ్లంతా బయటకు పోవాలంటే హెల్మెట్ పెట్టుకుని పోతుండ్రు. గా అరటి చెట్టును కొట్టెస్తే గీ పిట్టల బాధలు పోతాయి గదా అనుకుంటుండ్రా.. కన్న బిడ్డలెక్క పెంచిన గా అరటి చెట్టును నరికేయ్యాలంటే మనసొప్పుత లేదట. ఇగో గియ్యల్టీ ముచ్చట ఎట్లుంది మీరే చెప్పుండ్రి.
సుబ్బారావు గాలంకి, రచయిత
9848829574