Head writing story తల రాత కథ
Head writing story
తల రాత కథ
నేను : కరోనా స్ప్రెడ్ అవుతోంది, కాస్త జాగ్రత్తగా ఉండండి సర్.
అతను : ఏం పర్లేదు, రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.
నేను : బయటకు వెళ్లి, ఎక్కువగా గుంపులతో కలుస్తుంటారు, మాస్క్, శానిటైజెర్, భౌతిక దూరం పాటిస్తుండండి.
అతను : ఏం పర్లేదు, రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.
నేను : (ఫోన్లో )పాజిటివ్ అంటగా, ఐషలోషన్ లో ఉండండి, మిగతా వారికి అంటుకునే ప్రమాదం ఉంది.
అతను : ఏం పర్లేదు, ఎవరి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. రాత నుండి ఎవరూ తప్పించుకోలేరు.
నేను : నీ రాత పిచ్చి పాడుగాను, నీ పిచ్చితో నువు చస్తే చావు, మిగతా వారికి అంటియ్యకురా మూర్ఖుడా..
(నోట్ : కలియుగం నుంచి కంప్యూటర్ యుగంలోకి దూసుకెళ్లినా.. తలరాత అంటూ ఆలోచన చేసే ప్రజలలో మార్పు రావాలని మనసారా కోరుకుంటూ.. – యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)
తులసిరామ్. జీ
Face book